యాప్నగరం

అసదుద్దీన్ ఓవైసీ ఫోటో వున్న కేక్ కట్ చేసిన థాకరే

మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే పుట్టినరోజు సందర్భంగా ఆయన కట్ చేసిన కేక్‌పై ఎంఐఎం పార్టీ నేత

TNN 14 Jun 2016, 10:15 pm
మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే పుట్టినరోజు సందర్భంగా ఆయన కట్ చేసిన కేక్‌పై ఎంఐఎం పార్టీ నేత అసదుద్దీన్ ఓవైసీ ఫోటో వుండటం వివాదం రేపింది. మంగళవారం రాజ్ థాకరే పుట్టినరోజుని పురస్కరించుకుని ముంబైలోని అతడి నివాసమైన క్రిష్ణ కుంజ్‌కి చేరుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలు అసదుద్దీన్ ఓవైసీ ఫోటోతో కూడిన కేక్‌ని ప్రత్యేకంగా డిజైన్ చేయించి తమ వెంట తీసుకువచ్చారు.
Samayam Telugu raj thackeray birthdaymns chief cuts cake with owaisis photo
అసదుద్దీన్ ఓవైసీ ఫోటో వున్న కేక్ కట్ చేసిన థాకరే


అసదుద్దీన్ ఓవైసీ ఫోటోతో వున్న కేక్‌ని కట్ చేసిన రాజ్ థాకరేపై చర్యలు తీసుకోవాలని ఎంఐఎం ఎమ్మెల్యే వారిస్ పఠాన్ డిమాండ్ చేశారు. "తన గొంతుపై కత్తి పెట్టినా సరే తాను మాత్రం 'భారత్ మాతాకీ జై' అని అనబోను" అని గతంలో అసద్ వ్యాఖ్యానించినప్పటి నుంచి ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.