యాప్నగరం

రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే భద్రతా సిబ్బంది చేతివాటం

చుట్టూ జనాలు చూస్తున్నారన్న సిగ్గు లేకుండా డబ్బు ఎలా లాక్కొంటున్నాడో చూడండి..

Samayam Telugu 25 Sep 2018, 9:23 pm
రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే సెక్యూరిటీ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. బీజేపీ కార్యకర్తలకు ఇస్తున్న డబ్బును లాక్కొంటూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీఎం వసుంధరా రాజే.. అల్వార్ జిల్లా పర్యటనకు వెళ్లారు. కారులో సీఎంతో పాటూ.. వెనుక సీట్లో మంత్రి బాబూలాల్ వర్మ కూడా కూర్చొని ఉన్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన బీజేపీ మహిళా కార్యకర్తలు వసుంధరకు హారతి ఇచ్చి.. నుదుటన కుంకమ పెట్టారు.
Samayam Telugu Rajasthan Cm


మహిళా కార్యకర్త హారతి ఇచ్చినందుకు మంత్రి తన జేబులో నుంచి రూ.500 నోటు తీసి ఆమెకు ఇవ్వబోయాడు. ఇదే సమయంలో కారు వెనుకే నిలబడి ఉన్న సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరు ఆ నోటును లాక్కొన్నారు. మంత్రి చేతిలో నుంచి నోటు లాక్కోవడం పక్కనే ఉన్న మీడియా కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.