యాప్నగరం

Jodhpur Jet Crash: రాజస్థాన్‌లో కుప్పకూలిన మిగ్-27.. పైలెట్ సురక్షితం

ఆదివారం ఉదయం మిగ్-27 విమానం జోధ్‌పూర్ నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పైలట్‌ ప్యారాచూట్ సాయంతో సురక్షితంగా బయటపడ్డారు.

Samayam Telugu 31 Mar 2019, 2:38 pm

ప్రధానాంశాలు:

  • ఎయిర్ ఫోర్స్ అధికారుల్ని టెన్షన్ పెడుతోన్న వరుస ప్రమాదాలు
  • మూడు వారాల క్రితమే మిగ్-21 విమానం బికనూర్ ప్రాంతంలో కూలింది
  • అభినందన్ నడిపింది కూడా మిగ్-21 విమానం.. అది పాక్‌లో కుప్ప కూలింది
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu MIG.
రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో మిగ్-27 విమానం కుప్పకూలింది. ఆదివారం ఉదయం మిగ్-27 విమానం జోధ్‌పూర్ నుంచి బయల్దేరిన కొద్దిసేపటికే కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. జోధ్‌పూర్‌కు 120 కిలోమీటర్ల దూరంలోని సిరోహి ప్రాంతంలో కూలింది. ఈ ప్రమాదంలో పైలట్‌ ప్యారాచూట్ సాయంతో సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదంలో మిగ్-27 విమానం పూర్తిగా ధ్వంసమయ్యింది. ఈ ప్రమాదానికి కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.. ప్రమాదంపై ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేశారు దర్యాప్తుకు ఆదేశించారు.
మూడు వారాల క్రితం రాజస్థాన్‌లోని బికనూర్ ప్రాంతంలో మిగ్-21 విమానం కూలింది. ఆ ఘటనలో కూడా పైలెట్ సురక్షితంగా బయటపడ్డారు. మిగ్ విమానాలు వరుసగా కూలిపోయిన ఘటనలు అధికారుల్ని టెన్షన్ పెడుతున్నాయి. బాలాకోట్‌లోని ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన దాడి తర్వాత.. సరిహద్దులో పాక్‌ విమానాలను తిప్పికొట్టే క్రమంలో ఫిబ్రవరి 27న వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ నడిపింది కూడా మిగ్‌-21. ఈ విమానం కూడా పాక్ భూ భాగంలో కూలిపోయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.