యాప్నగరం

రజనీ పాలిటిక్స్ పై కమల్ హాట్‌కామెంట్స్!

రాజకీయాల్లో తనకూ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఎలాంటి పోలికా ఉండదని,

TNN 26 Sep 2017, 7:41 am
రాజకీయాల్లో తనకూ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు ఎలాంటి పోలికా ఉండదని, రాజకీయాన్ని కమల్ వర్సెస్ రజనీగా చూడటం సబబు కాదు.. అని అన్నాడు యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్. ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పొలిటికల్ ఎంట్రీ, రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ గురించి కమల్ ఆసక్తిదాయకమైన వ్యాఖ్యానాలు చేశాడు. రజనీకాంత్ కు మతవిశ్వాసాలు ఎక్కువ అని కమల్ అభిప్రాయపడ్డాడు. అలాంటి వ్యక్తికి భారతీయ జనతా పార్టీనే తగిన వేదిక అవుతుందని కమల్ కామెంట్ చేశాడు.
Samayam Telugu rajinikanth a suitable ally for bjp kamal haasan
రజనీ పాలిటిక్స్ పై కమల్ హాట్‌కామెంట్స్!


తన వరకూ తను హేతువాదిని అని కమల్ మరోసారి స్పష్టం చేశాడు. తను రాజకీయాల్లోకి వస్తున్నట్టుగా రజనీకాంత్ కు చెప్పానని కూడా కమల్ అన్నాడు. అతడు తనకు స్నేహితుడని..అందుకే సమాచారం ఇచ్చాను అన్నాడు.

ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో సమావేశం గురించి మాట్లాడుతూ.. తనకూ, ఆప్ మధ్య ఎలాంటి ఒప్పందం లేదన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ పయనం నుంచి తను కొన్ని పాఠాలు నేర్చుకుంటానని అన్నారు. తన పార్టీకి ప్రజలే విరాళం ఇస్తారని కమల్ చెప్పాడు. డీఎంకేతో రహస్య ఒప్పందం ఉందన్న ప్రచారాన్ని కమల్ ఖండించాడు. తన పార్టీకి ద్రవిడ పార్టీలన్నింటితోనూ ఒకే దూరం ఉంటుందని కమల్ స్పష్టం చేశాడు.

మరి తన స్నేహితుడు రజనీకాంత్ కు బీజేపీనే తగిన పార్టీ, సొంత పార్టీ పెట్టుకోవడం కన్నా..ఆయన అందులో చేరడమే తగిన పని అన్నట్టుగా కమల్ వ్యాఖ్యానించడం ఆసక్తిదాయకంగా మారిందిప్పుడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.