యాప్నగరం

ఆయన నిర్ణయం సరైంది కాదు..సుప్రీం తీర్పుకు హ్యాట్సాఫ్: రజనీ

కర్ణాటకలో రాజకీయ పరిణామాలపై తనదైన స్టైల్లో స్పందించారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. కన్నడనాట జరిగిన హైడ్రామా ఆవేదన కలిగించదని... చివరికి ప్రజాస్వామ్యమే గెలించిందని వ్యాఖ్యానించారు.

Samayam Telugu 20 May 2018, 4:24 pm
కర్ణాటకలో రాజకీయ పరిణామాలపై తనదైన స్టైల్లో స్పందించారు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. కన్నడనాట జరిగిన హైడ్రామా ఆవేదన కలిగించదని... చివరికి ప్రజాస్వామ్యమే గెలించిందని వ్యాఖ్యానించారు. చెన్నైలో తన పార్టీ మహిళా విభాగం నేతలతో సమావేశం తర్వాత ఆయన రాజకీయ పరిణామాలపై మాట్లాడారు. బలపరీక్షపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు హ్యాట్సాఫ్ చెప్పిన ఆయన... ధన్యవాదాలు కూడా తెలిపారు. కర్ణాటక గవర్నర్ నిర్ణయాన్ని కూడా తప్పుబట్టిన రజనీ... అసెంబ్లీలో బల నిరూపణకు 15 రోజుల సమయం ఇవ్వడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. కొందరు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయాలని చూసినా... న్యాయమే గెలించిందని వ్యాఖ్యానించారు.
Samayam Telugu Rajani


కావేరీ నది జలాల వివాదం, పార్టీ ఏర్పాటు, పొత్తులపై కూడా రజనీ మాట్లాడారు. కర్ణాటకలో ఎవరు అధికారంలోకి వచ్చినా సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు చేయాలన్నారు. దీనికి సంబంధించి ఓ అధికారిని కాని... బోర్డును ఏర్పాటు చేస్తే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తన రాజకీయ వ్యూహాలపై స్పందించిన తమిళ సూపర్ స్టార్... తాను దేనికైనా సిద్ధంగా ఉన్నాననే సంకేతాలిచ్చారు. పార్టీ ఏర్పాటు కాకుండానే పొత్తులపై మాట్లాడటం తొందరపాటేనని... 2019లో పోటీ చేసేది లేనిది ఎన్నికల షెడ్యూల్ వచ్చాక నిర్ణయిస్తామన్నారు. తన పార్టీకి మహిళల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తోందని... ఆడవాళ్లు ఎక్కడుంటే అక్కడ విజయం ఉంటుందని వ్యాఖ్యానించారు.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.