యాప్నగరం

Rajnath Singh: కేరళ సీఎంతో కలిసి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఏరియల్‌ సర్వే

కేరళ రాష్ట్రం ఇంకా జలదిగ్బం ధంలోనే ఉంది. దాదాపు 8 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు.

Samayam Telugu 13 Aug 2018, 7:57 am
కేరళ రాష్ట్రం ఇంకా జలదిగ్బం ధంలోనే ఉంది. దాదాపు 8 జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. వరద బీభత్స పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో కలిసి ఆదివారం నాడు వరద ప్రభావిత ప్రాంతాల్లో రాజ్‌నాథ్‌ ఏరియల్‌ సర్వే నిర్వహించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కేరళ గతంలో ఎన్నడూ లేనంత సంక్షోభాన్ని ఎదుర్కొంటోందన్నారు. తక్షణ సాయంగా రూ.100 కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
Samayam Telugu ఏరియ‌ల్ సర్వేలో రాజ్‌నాథ్, విజ‌య‌న్


33 మంది మృతి..ఆరుగురు గల్లంతు : సీఎం

రాష్ట్రంలో వరద బీభత్సానికి 37మంది మృతి చెందారని, ఆరుగురు గల్లంతయ్యారని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆదివారం నాడు ప్రకటించారు. కేరళలో ఇటువంటి విధ్వంసం మునుపెన్నడూ చూడలేదని, రాష్ట్రం మొత్తం ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంటుందనీ, ఎటువంటి సహాయమైనా అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ పరిస్థితిని ఎదుర్కొవడానికి అవసరమైతే తన సహాయాన్ని అందిస్తానని ప్రధాని మోడీ హామీనిచ్చారని తెలిపారు.

'రాష్ట్ర ప్రజలకు సహాయం చేయాలనే ఉద్దేశమే లక్ష్యంగా పోలీసులు, ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఆర్మీ, ఇతర బలగాలు పనిచేస్తున్నాయి.ప్రధాని నాతో చర్చించారు. ఎటువంటి సహాయమైనా, అన్ని ఏర్పాట్లు చేస్తామని ప్రధాని హామీనిచ్చారు' అని విజయన్‌ తెలిపారు. వెయ్యి మంది పైగా ప్రజలను భారత ఆర్మీ విభాగంలోని వివిధ బృందాలు రక్షించాయని, వారు నిర్విరామంగా కృషి చేశారని కొనియాడారు. కేరళలో కొన్ని రోజులుగా కురు స్తోన్న వర్షాల వల్ల జనజీవనం స్థంభించింది. కన్నూర్‌, వయనాడ్‌, కోజికోడ్‌, ఇడుక్కి, మలప్పురం జిల్లాలో ఈ వర్షప్రభావం ఎక్కువగా ఉంది. వరద నీటిలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయ్యాయి. అక్కడ సహాయ కార్యక లాపాలు నిర్వహించడానికి రక్షణ దళ సిబ్బంది నిరంతరాయంగా కృషి చేస్తారని భారత ఆర్మీ హామీనిచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.