యాప్నగరం

సభ నడిచే తీరు ఇది కాదంటూ అన్సారీ ఆగ్రహం!

స‌భా వ్య‌వ‌హారాల తీరుపై రాజ్య‌స‌భ చైర్మ‌న్ హ‌మిద్ అన్సారీ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు.

TNN 20 Mar 2017, 8:14 pm
స‌భా వ్య‌వ‌హారాల తీరుపై రాజ్య‌స‌భ చైర్మ‌న్ హ‌మిద్ అన్సారీ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో స‌భ‌లో ముగ్గురు మంత్రులు లేక‌పోవ‌డాన్ని ఆయ‌న త‌ప్పుబట్టారు. సభ్యులు ప్ర‌శ్న‌లు వేసినప్పుడు.. వాటికి స‌మాధానం ఇవ్వడానికి ఆయా శాఖల మంత్రులు స‌భ‌లో లేక‌పోవ‌డాన్ని అన్సారీ ప్ర‌శ్నించారు. స‌భా వ్య‌వ‌హారాలు న‌డిచే ప్ర‌క్రియ ఇది కాదంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల సంఖ్య ఎక్కువే ఉన్నా, పాల‌న తీరు స‌రిగాలేద‌ంటూ చైర్మ‌న్ ఫైర్ అయ్యారు. ఆ స‌మ‌యంలో కేవ‌లం స‌హాయ మంత్రులు నిర్మ‌లా సీతారామ‌న్‌, రామ్ కృపాల్‌, బాల్య‌న్ మాత్రమే రాజ్యసభలో ఉన్నారు. వివరాల్లోకి వెళితే..
Samayam Telugu rajya sabha chairman hamid ansari unhappy as mps go missing during question hour
సభ నడిచే తీరు ఇది కాదంటూ అన్సారీ ఆగ్రహం!


య‌మునా వాట‌ర్ టాక్సీ ప్రాజెక్ట్‌కు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ షిప్పింగ్‌కు ప్ర‌శ్న వచ్చింది. అయితే ఆ ప్ర‌శ్న వేసిన ఎంపీ కానీ, దానికి స‌మాధానం ఇచ్చే మంత్రి కానీ స‌భ‌లో లేరు. దీంతో అన్సారీ ఇది అసాధార‌ణ ప‌రిస్థితి అని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆ త‌ర్వాత ప‌ర్యావ‌ర‌ణ‌శాఖ‌కు సంబంధించిన ప్ర‌శ్న వ‌చ్చింది. దానికి స‌మాధానం ఇచ్చేందుకు మంత్రులు ఎవ‌రూ స‌భ‌లో లేరు. దీంతో కాంగ్రెస్ ఎంపీ జ‌య‌రాం ర‌మేశ్ ప్ర‌భుత్వ తీరును ప్ర‌శ్నించారు. స‌భ‌లో ఒక్క కేబినెట్ మంత్రి కూడా లేర‌ని ఆరోపించారు. విద్యుత్తు శాఖ‌కు సంబంధించిన ప్ర‌శ్న వ‌చ్చిన‌ప్పుడు కూడా స‌భ‌లో ఆ శాఖ మంత్రి లేక‌పోవ‌డంతో చైర్మ‌న్ మ‌రింత ఆగ్ర‌హానికి లోనై పైవిధంగా వ్యాఖ్యానించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.