యాప్నగరం

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ

రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. 16 రాష్ట్రాల్లో 58 స్థానాలకు ఎన్నికల నిర్వహణకు వీలుగా ఈసీ షెడ్యూల్‌ను ప్రకటించింది.

TNN 23 Feb 2018, 8:21 pm
రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలకు ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను ప్రకటించింది. 16 రాష్ట్రాల్లో 58 స్థానాలకు ఎన్నికల నిర్వహణకు వీలుగా ఈసీ షెడ్యూల్‌ను ప్రకటించింది. ఏపీ, తెలంగాణల్లో ముగ్గురు సభ్యుల పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 9 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ స్థానాలను భర్తీ చేయడానికి మార్చి 23న ఓటింగ్ నిర్వహించనున్నారు. అదే రోజున ఓట్ల లెక్కింపు జరగనుంది.
Samayam Telugu rajya sabha elections 2018 schedule released by ec
రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ


మార్చి 5న ఇందుకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. మార్చి 12 వరకూ దరఖాస్తులను స్వీకరిస్తారు. మరుసటి రోజు దరఖాస్తులన పరిశీలిస్తారు. మార్చి 15లోగా దరఖాస్తులను ఉపసంహరించుకునే వీలుంది.

పదవీ కాలం ముగిసిన 58 స్థానాలతోపాటు గతేడాది పదవికి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కేరళ ఎంపీ వీరేంద్రకుమార్ స్థానానికి కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.