యాప్నగరం

రాజ్యసభ ఎంపీలకు టాటా వీడుకోలు..

రాజ్యసభ ఎంపీలుగా పదవీ కాలం పూర్తిచేసుకున్న వారికి శుక్రవారం నాడు సభ ఘనంగా వీడ్కోలు పలికింది

TNN 13 May 2016, 7:41 pm
రాజ్యసభ ఎంపీలుగా పదవీ కాలం పూర్తిచేసుకున్న వారికి శుక్రవారం నాడు సభ ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ వీడుకోలు కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ, ఉపఛైర్మన్ కురియన్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ వివిధ రంగాలు, అంశాల్లో నిపుణత సాధించిన గొప్ప భారతీయులకు రాజ్యసభ నిలయమని, అటువంటి వారిలో కొందరు గురువారం నాడు తమ పదవీకాలం ముగియడంతో పదవీ విరమణ చేస్తున్నారన్నారు. ఎంపీలుగా ఎన్నికైన వారంతా తమ శాయశక్తులా ప్రజాప్రయోజనాల కోసం పాటుపడటం హర్షనీయమన్నారు. దేశానికి సేవచేస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పారు. ఈ విడతలో 53మంది ఎంపీల పదవీకాలం ముగుస్తుంది. ఈ సందర్భంగా ఆయన పెద్దల సభకు పరోక్షంగా చురకలు కూడా అంటించారు. పలు కీలకమైన బిల్లులను ఆమోదించకుండా కాలు అడ్డుపెట్టడం ద్వారా రాజ్యసభ సంస్కరణల అమలుకు ఇబ్బందులు కలుగుచేసినట్లు పరోక్షంగా చెప్పుకొచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.