యాప్నగరం

అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంపై సభలో దుమారం

రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుల నినాదాలతో గందరగోళ వాతావరణం నెలకొంది.

TNN 27 Apr 2016, 1:24 pm
అగష్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో గందరగోళ వాతావరణం నెలకొంది. ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యుడు సుబ్రమణ్యం స్వామీ దీనిపై చర్చ జరగాలని నోటీసులు ఇచ్చారు. దీనిపై స్పందించిన వైస్ ఛైర్మన్ కురియన్ చర్చకు అనుమతి ఇచ్చారు. ఆ సందర్భంగా సుబ్రమణ్యస్వామీ మాట్లాడుతూ అగస్టా కుంభకోణంలో సోనియా గాంధీ హస్తముందని ఆరోపించారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సోనియా పేరు ప్రస్తావించడాన్ని తప్పుబట్టారు. విచారణ ముగియక ముందే నిందలు వేయడం సరికాదన్నారు. దీనికి స్పందించిన కురియన్ సభలో లేని వ్యక్తుల పేర్లు ప్రస్తావించవద్దని సుబ్రమణ్యస్వామికి సూచించారు. సుబ్రమణ్య స్వామి క్షమాపణలు చెప్పాల్సిందే నంటూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. దీనికి కురియన్ అంగీకరించకపోవడంతో సభ్యులు పోడియం వద్దకు వెళ్లి ఆందోళనకు దిగారు. దీంతో వైస్ ఛైర్మన్ కురియన్ సభను వాయిదా వేశారు.
Samayam Telugu rajya sabha sessions
అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంపై సభలో దుమారం


అగస్టా వెస్ట్ ల్యాండ్ అనేది వీవీఐపీ హెలి కాఫ్టర్ .. దీన్ని ఇటలీ సంస్థ తయారు చేస్తుంది.. ఆ హెలికాఫ్టర్ కొనుగోలు కోసం 2010లో యూపీఏ ప్రభుత్వం రూ.3 వేల 600 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భారీగా అవినీతి చోటు చేసుకున్నట్లు బీజేపీ ఆరోపిస్తోంది. మరోవైపు దీనిపై సీఐబీ విచారణ జరుపుతోందని.. విచారణ పూర్తి కాకముందే తమ అధినేత్రిపై నిందలు ఎలా మోపుతారని కాంగ్రెస్ ప్రశ్నించింది. బీజేపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు విచారణ ఎందుకు పూర్తి చేయలేకపోయిందని కాంగ్రెస్ ప్రశ్నించింది.

అగస్టా వెస్ట్ ల్యాండ్ ఒప్పందం ప్రకారం మొత్తం 12 హెలికాఫ్టర్లు కొనుగోలు చేయాలని అప్పట్లో యూపీఏ సర్కార్ భావించింది .. ఈ హెలికాఫ్టర్లను కీలక నేతల కోసం వినియోగించాలని కాంగ్రెస్ తీర్మానించింది. అయితే భారత్ తో కురుద్చుకున్న ఒప్పందంలో అవినీతి చోటు చేసుకున్నట్లు ఇటలీ ప్రభుత్వం గుర్తించింది. ఈ కేసులో ఇద్దర్ని అరెస్ట్ కూడా చేసింది. ఒప్పందం కోసం భారత అధికారులకు ముడుపులు చెల్లించినట్లు ఇటలీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ప్రస్తుతం అగస్టా వెస్ట్ ల్యాండ్ ను బీజేపీ సర్కార్ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ఈ కేసును ప్రస్తుతం సీబీఐ విచారణ జరుపుతోంది

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.