యాప్నగరం

అయోధ్య చేరుకున్న మోదీ.. పారిజాత మొక్క నాటనున్న ప్రధాని

కాసేపటి క్రితమే ప్రధాని మోదీ అయోధ్య చేరుకున్నారు. ముందుగా హనుమాన్ గడి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొననున్నారు ప్రధాని.

Samayam Telugu 5 Aug 2020, 11:47 am
అయోధ్య చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా మోదీకి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇతర అధికారులు ఘన స్వాగతం పలికారు. ముందుగా మోదీ నగరంలోని హనుమాన్ గడి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగే ప్రదేశానికి మోదీ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అయోధ్య రామమందరి భూమి పూజ జరిగే ప్రదేశానికి చేరుకోనున్నారు. ఆలయ ప్రాంగణంలో పారిజాత మొక్కను మోదీ నాటనున్నారు. మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 8 సెకన్లకు భూమి పూజ చేయనున్నారు ప్రధాని మోదీ. మొత్తం 3 గంటలపాటు అయోధ్యలో మోదీ పర్యటన కొనసాగనుంది.
Samayam Telugu అయోధ్య చేరుకున్న ప్రధాని మోదీ
pm modi reached ayodhya

Read More: పూరీ బీచ్‌లో అయోధ్య సైకత రామాలయం
అయోధ్య భూమి పూజ సందర్భంగా మోదీ ప్రత్యేకమైన వస్త్రాలు ధరించి అయోధ్యకు బయల్దేరారు. పట్టుపంచె, పొడగు కుర్తా ధరించిన మోడీ మెడలో పట్టువస్త్రాన్ని వేసుకున్నారు. సంప్రదాయబద్ధ వస్త్రధారణలో మోడీ లక్నో నుంచి హెలికాప్టరులో బయలుదేరి అయోధ్యకు చేరుకున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో అయోధ్యలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.మరోవైపు అయోధ్య భూమి పూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని ప్రణాళికలు రచించినప్పటికీ.. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో అత్యంత ప్రముఖులను మాత్రమే ఆహ్వానిస్తున్నారు. భారత్ గడ్డపై పుట్టిన 36 ప్రముఖ మత సంప్రదాయాలకు చెందిన 135 మంది సాధువులు ఈ వేడుకకు వస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.