యాప్నగరం

పరిష్కారం దిశగా అయోధ్య వివాదం!

దశాబ్దాలు సాగుతోన్న అయోధ్య వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రామజన్మభూమి వివాదం పరిష్కారానికి షియా వక్ఫ్ బోర్డ్ కొత్త ప్రతిపాదన చేసింది.

TNN 20 Nov 2017, 3:38 pm
దశాబ్దాలు సాగుతోన్న అయోధ్య వివాదంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రామజన్మభూమి వివాదం పరిష్కారానికి షియా వక్ఫ్ బోర్డ్ కొత్త ప్రతిపాదన చేసింది. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి తమకు అభ్యంతరం లేదని షియా వక్ఫ్ బోర్డు ప్రకటించింది. అయితే రామమందిరాన్ని అయోధ్యలోనూ, మసీదును లక్నోలోనూ నిర్మించాలని కోరింది. అన్ని వర్గాలతో చర్చించిన తరువాత ఈ ప్రతిపాదన చేశామని వక్ఫ్ బోర్డ్ చైర్మన్ సయ్యద్ వసీద్ రిజ్వీ పేర్కొన్నారు. మరోవైపు ఈ వివాదంపై సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున పరిష్కారానికి డిసెంబర్ 5న కొందరు మహంతులతో కలిసికోర్టుకు ఈ ప్రతిపాదన గురించి నివేదించనున్నారు. అలాగే మసీదు కోసం లక్నోలో ఎకరం స్థలం కేటాయించాలని కోరనున్నారు.
Samayam Telugu ram mandir can be built in ayodhya mosque can come up in lucknow shia waqf board
పరిష్కారం దిశగా అయోధ్య వివాదం!


అయోధ్యలో కొత్తగా మసీదు నిర్మించాల్సిన అవసరం లేదని వారం రోజుల కిందట రజ్వీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయోధ్య లేదా ఫైజాబాద్‌లో కొత్తగా మసీదు నిర్మించాల్సిన అవసరంలేదని ఏకగ్రీవంగా తీర్మానించామని ఆయన తెలిపారు. ఈ వివాదంపై సున్నీ వక్ఫ్ బోర్డ్ వివిధ కోర్టుల్లో దాఖలు చేసిన కేసులు వీగిపోయానని, కేవలం షియాలకు మాత్రమే మసీదుపై హక్కు ఉందని రజ్వీ పేర్కొన్నారు. అంతేకాదు ముస్లిం ప్రభావిత ప్రాంతాన్ని గుర్తించి, ప్రభుత్వానికి సమాచారం అందిస్తామని తెలియజేశారు. అఖిల భారతీయ అఖాడ పరిషత్‌ కూడా అయోధ్యలో మసీదు నిర్మాణంపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ కూడా రామజన్మభూమి వివాదం పరిష్కారానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.