యాప్నగరం

రామ మందిర నిర్మాణానికి డెడ్ లైన్.. అమిత్ షా కీలక ప్రకటన..

Ayodhya | రామ మందిర నిర్మాణానికి బీజేపీ చీఫ్ అమిత్ షా డెడ్ లైన్ విధించారు. నాలుగు నెలల్లోగా భారీ స్థాయిలో రామాలయాన్ని నిర్మిస్తామని ప్రకటించారు.

Samayam Telugu 16 Dec 2019, 3:25 pm
కేంద్ర హోం మంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సోమవారం అయోధ్య రామమందిర నిర్మాణంపై కీలక ప్రకటన చేశారు. జార్ఖండ్‌లోని పకూర్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. అయోధ్యలో రామ మందిరాన్ని నాలుగు నెలల్లో నిర్మిస్తామన్నారు. భారీ స్థాయిలో ఆలయాన్ని నిర్మిస్తామని ఆయన ప్రకటించారు. తిరుమలకు దీటుగా ప్రముఖ పుణ్యక్షేత్రంగా అయోధ్య రామ మందిరాన్ని తీర్చిదిద్దుతామని గతంలో బీజేపీ నేతలు మాటిచ్చారు.
Samayam Telugu amit shah


నవంబర్ 9న సుప్రీం కోర్టు అయోధ్య వివాదంపై తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి అనుకూలంగా అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. అయోధ్యలో మసీదు నిర్మాణానికి వీలుగా ఐదెకరాల స్థలం కేటాయించాలని సుప్రీం కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది.

అయోధ్య తీర్పును పునః సమీక్షించాలని కోరుతూ 18 రివ్యూ సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. కాగా వీటన్నింటిని ఇటీవలే అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.