యాప్నగరం

మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధింపు.. ఆర్టికల్ 356 ఏం చెబుతోందంటే..

మలుపులు తిరిగిన మహారాష్ట్ర రాజకీయానికి తెరపడింది. రాష్ట్రపతి పాలనకు కోవింద్ ఆమోదముద్ర వేశారు. మరోవైపు శివసేన గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లింది.

Samayam Telugu 12 Nov 2019, 6:52 pm
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమలు చేస్తూ రామ్‌నాథ్ కోవింద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన దస్త్రంపై ఆయన సంతకం చేశారు. మహారాష్ట్రలోని రాజకీయ పార్టీలేవి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితిలో లేకపోవడంతో.. రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తూ.. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ కేంద్రానికి నివేదిక పంపారు. దీనిపై చర్చించిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అనంతరం కేంద్ర కేబినెట్‌ సిఫారసు, మహారాష్ట్ర గవర్నర్‌ నివేదికను రాష్ట్రపతి వద్దకు పంపగా.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించడానికి ఆయన ఆమోదముద్ర వేశారు.
Samayam Telugu kovind indiatimes


రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ఈ అధికరణం ప్రకారం ఆరు నెలలపాటు రాష్ట్రపతి పాలన విధించే అధికారం కేంద్రానికి ఉంది. దీనికి పార్లమెంట్ ఆమోదం తప్పనిసరి. మరోసారి పార్లమెంట్ ఆమోదిస్తే.. రాష్ట్రపతి పాలనను మరో ఆరు నెలలపాటు పొడిగించే అవకాశం ఉంది.

ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి.. కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతు కూడగట్టడానికి తమకు మరో మూడు రోజుల గడువు కావాలని శివసేన కోరగా.. దానికి గవర్నర్ అంగీకరించలేదు. దీంతో గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. శివసేన సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఈ విషయంలో అత్యున్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.