యాప్నగరం

గుర్మీత్ కేసు: పంజాబ్, హర్యానాల్లో హైఅలర్ట్

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్చా సౌదా చీఫ్, రాక్‌ స్టార్‌ బాబాగా పేరొందిన గుర్మీత్‌ రామ్‌ రహీంసింగ్‌పై నమోదైన అత్యాచారం కేసులో తీర్పు నేడు వెలువడనుంది.

TNN 25 Aug 2017, 11:02 am
వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్చా సౌదా చీఫ్, రాక్‌ స్టార్‌ బాబాగా పేరొందిన గుర్మీత్‌ రామ్‌ రహీంసింగ్‌పై నమోదైన అత్యాచారం కేసులో తీర్పు నేడు వెలువడనుంది. ఈ నేపథ్యంలో పంజాబ్, హర్యానాల్లో పోలీసులు హై అలెర్ట్ ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లోనూ భారీగా పారా మిలటరీ బలగాలను మోహరించారు. గుర్మీత్‌కు మద్దతుగా వేలాదిమంది భక్తులు పంచకుల చేరుకుంటున్నారు. వెన్ను నొప్పి తనను బాధిస్తున్నా కోర్టుకు హాజరవుతున్నట్టు గుర్మీత్ ట్వీట్ చేశారు. కాసేపటి కిందట తన అనుచరులతో కలిసి పంచకుల కోర్టుకు బయలుదేరారు. అందరూ సంయమనం పాటించాలని, శాంతియుతంగా ఉండాలని ఆయన తన అనుచరులకు పిలుపునిచ్చారు.
Samayam Telugu ram rahims 100 car convoy heads to court ahead of verdict
గుర్మీత్ కేసు: పంజాబ్, హర్యానాల్లో హైఅలర్ట్



2002లో బాబా గుర్మీత్‌ తమపై ఆయన అత్యాచారానికి పాల్పడ్డారంటూ ఇద్దరు మహిళ సాధ్వీలు ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పట్లోనే పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. కాగా, తీర్పు నేపథ్యంలో పంచకుల జిల్లా కోర్టుకు వెళ్లే మార్గాలపై పోలీసులు నిఘా పెంచారు. అత్యాచార ఆరోపణలకు సంబంధించిన 15 ఏళ్ల నాటి కేసులో సీబీఐ కోర్టు ఇవాళ తీర్పు చెప్పనుంది. దీంతో గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అనుచరులు పెద్ద సంఖ్యలో సీబీఐ కోర్టు ఎదుటకు చేరుకుంటున్నారు. కోర్టు తీర్పు చెప్పే వరకు కదిలేది లేదంటూ గుర్మీత్ రామ్ అనుచరులు కోర్టు బయట రహదారిపై దుప్పట్లు, సామాన్లతో తిష్ట వేశారు. ఆయన మద్దతుదారులు 100 వాహనాలతో కాన్యాయ్‌గా సిర్సా నుంచి పంచకులకు బయలుదేరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.