యాప్నగరం

మరో విలయం.. కేరళలో మళ్లీ రెడ్ అలర్ట్

ఐఎండీ హెచ్చరికలతో అప్రమత్తమైన సీఎం పినరయి విజయన్ ఉన్నతాధికారులతో బుధవారం సాయంత్రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

Samayam Telugu 3 Oct 2018, 11:34 pm
కొంతకాలం కిందట భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమై ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కేరళకు మరో భయం వెంటాడుతోంది. భారత వాతావరణ శాఖ సమాచారం మేరకు రానున్న శని, ఆదివారాల్లో కేరళకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు హెచ్చరించారు. ముఖ్యంగా ఇడుక్కి, పలక్కాడ్, త్రిసూర్ జిల్లాలకు అక్టోబర్ 7న రెడ్ అలర్ట్ ప్రకటించారు. తుపాను ప్రభావం హెచ్చరికలతో అప్రమత్తమైన సీఎం పినరయి విజయన్ ఉన్నతాధికారులతో బుధవారం సాయంత్రం అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.
Samayam Telugu Kerala rd alert


అక్టోబర్ 6వరకు సాధారణ వర్షాలు పడతాయని, అప్పటివరకూ ఎల్లో అలర్ట్ ప్రకటన వచ్చిటన్లు కేరళ అధికారులు తెలిపారు. మరోసారి విపత్తు హెచ్చరికల నేపథ్యంలో సమావేశంలో పినరయి విజయన్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. సహాయ చర్యలు చేపట్టేందుకు కేంద్ర బలగాలకు రాష్ట్రానికి పంపాలని కోరారు.

తీర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీఎం సూచించారు. అధికారులు చెప్పేవరకూ జాలర్లు సముద్రంలో వేటకు పల వేటకు వెళ్లవద్దని, రెడ్‌ అలర్ట్‌ ప్రకటించిన మూడు జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. వరదల నుంచి కోలుకుంటున్న రాష్ట్రం.. ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా 350 మందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.