యాప్నగరం

విజయ్ మాల్యాపై రెడ్ కార్నర్ అస్త్రం..

ఢిల్లీ: విజయ్ మాల్యాను భారత్ కు రప్పించే చర్యలను ఈడీ ముమ్మరం చేసింది.

TNN 12 May 2016, 1:26 pm
బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి బ్రిటన్ లో తలదాచుకున్న విజయ్ మాల్యాను భారత్ కు రప్పించే చర్యలను ఈడీ ముమ్మరం చేసింది. తాజాగా ఆయనపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసి భారత్ కు రప్పించాలని భావిస్తోంది. ఈ మేరకు నోటీసులు జారీ చేయాలని ఇంటల్ పోల్ ను ఆశ్రయించింది. అయితే దీనిపై ఇంటర్ పోల్‌ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం అందలేదు. అంత్యంత తీవ్రమైన నేరాలు చేసిన వారికి ఇంటల్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి నిందితులను విదేశాల నుంచి రప్పించవచ్చు. గతంలో ఇది ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి, ఐసీఎల్ మ్యాచ్ ఫిక్సర్ లలిత్ మోడీ పై ఇదే రకమైన నోటీసులు జారీ చేసి భారత్ కు రప్పించారు.
Samayam Telugu red corner notice to vijay mallya
విజయ్ మాల్యాపై రెడ్ కార్నర్ అస్త్రం..


బుధవారం లోక్ సభలో ప్రతిపక్షాలు విజయ్ మాల్యా అంశాన్ని లేవనెత్తి ప్రభుత్వంపై దుమ్మత్తిపోసిన విషయం తెలిసిందే. విపక్షాల ఆరోపణలపై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ ప్రస్తుత పరిస్థితుల్లో మాల్యాను వెనక్కి రప్పించడం కుదరదని నేరారోపణ రుజువు చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేసినప్పుడే ఇది సాధ్యపడుతుందని పేర్కొన్నారు. జైట్లీ వ్యాఖ్యనించిన మరుసటి రోజే ఈడీ తన చర్యలను వేగవంతం చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా మాల్యాపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఇంటల్ పోల్ ను కోరింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.