యాప్నగరం

​టెండూల్కర్ ఇది పద్ధతి కాదు.. తీరు మార్చుకోవాలి!

క్రికెట్, ఇతర ప్రమోషన్, తన వ్యాపార కార్యక్రమాలతో సచిన్ బిజీగా ఉంటున్నాడు,

TNN 31 Mar 2017, 7:54 am
రాజ్యసభ సభ్యుడిగా సచిన్ టెండూల్కర్ పనితీరు విషయంలో పెద్దల సభ నుంచి మరోసారి విమర్శలు వచ్చాయి. సచిన్ సభకు హాజరు కాకపోవడం గురించి మరోసారి సాటి సభ్యులు ఫైర్ అయ్యారు. సచిన్ కు అంత ఆసక్తి లేకపోతే పదవి నుంచి తప్పుకోవాలని కూడా వాళ్లు సలహా ఇచ్చారు. కేవలం సచిన్ కు మాత్రమే కాదు నటి రేఖకు కూడా రాజ్యసభ నుంచి సెగ తగిలింది. ఈమె కూడా సభకు హాజరు కావడం విషయంలో అలసత్వం ప్రదర్శిస్తోంది.
Samayam Telugu rekha sachin tendulkar among top rajya sabha absentees shouldnt they resign asks sp leader
​టెండూల్కర్ ఇది పద్ధతి కాదు.. తీరు మార్చుకోవాలి!


ఈ ఏడాది ఇప్పటి వరకూ రాజ్యసభ పదమూడు రోజులు సమావేశం కాగా, సచిన్, రేఖలు కనీసం ఒక్క రోజు కూడా సభకు రాలేదు. క్రికెట్, ఇతర ప్రమోషన్, తన వ్యాపార కార్యక్రమాలతో సచిన్ బిజీగా ఉంటున్నాడు, రేఖ ఇప్పటికి సినిమాలు, అవార్డ్ షోలు, ఇతర కార్యక్రమాలతో బిజీగా ఉంటారు. ఈ నేపథ్యంలో వీరికి సభకు వెళ్లే తీరిక చిక్కినట్టుగా లేదు. దీంతో ఇప్పటి వరకూ పలు మార్లు సభలో వీరి అటెండెన్స్ గురించి చర్చ జరిగింది.

తాజాగా సమాజ్ వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్.. టెండూల్కర్, రేఖలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆసక్తి లేకపోతే తప్పుకోవాలని అన్నారు. నామినేటెడ్ ఎంపీలకు సభపై ఇంత అనాసక్తి పనికిరాదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయంలో తను వారికి లేఖలు రాస్తానని ఆయన తెలిపారు.

గురువారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న టెండూల్కర్ ను ఈ అంశంపై స్పందించమని కోరగా ఆయన నిరాకరించారు. ఒక మొబైల్ అప్లికేషన్ లాంఛ్ కార్యక్రమంలో అగర్వాల్ ప్రస్తావించిన అంశాలపై స్పందించడానికి సచిన్ నో చెప్పాడు. రాజ్యసభలో అటెండెన్స్ పై మాట్లాడటానికి ఈ కార్యక్రమం తగిన వేదిక కాదన్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.