యాప్నగరం

Rent a jail Room: ఇకపై జైల్లో గదిని అద్దెకు తీసుకోవచ్చంట.. రెంట్ కూడా చాలా తక్కువ

ఉత్తరాఖండ్‌లోని ఓ జైలు అధికారులు మంచి అవకాశాన్ని (Rent a jail Room) ఇస్తున్నారు. జైల్లో ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఉన్నవారికి ఇది మంచి అవకాశం. జైలు గదిని అద్దెకిస్తారంట. రోజుకు రూ.500లు చెల్లించి ఎన్నిరోజులైన ఉండొచ్చట. ఈ విషయాన్ని స్వయంగా ఆ జైలు సూపరింటెండెంటే చెప్పారు. దీని వెనుక ఒక కారణం కూడా ఉందంటున్నారు. జైలు అనుభవం కావాలనుకున్న వారు వెంటనే రెంట్ ఇచ్చి ఒక గదిలో ఉండొచ్చు. ఈ వినూత్నమైన కార్యక్రమానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 1 Oct 2022, 4:57 pm
Rent a jail Room: కొంతమందికి విచిత్రమైన ఆశలు ఉంటాయి. అందులో జైలు చూడాలనుకోవడం కూడా ఒకటి. నేరాలు చేసిన వారిని మాత్రమే జైలుకు పంపిస్తారు. మిగతా వారికి నో ఎంట్రీ. కానీ చాలామందికి జైల్లో ఎలా ఉంటుందనో ఆసక్తి ఉంటుంది. లోపల చూడ్డానికి అవకాశం ఇస్తే బాగుండు అని కూడా అనుకుంటారు. ఇప్పుడు ఆ ఆశ తీర్చుకునే అవకాశం ఏర్పడింది. రూ.500లు ఉంటే చాలు.. ఒక రాత్రి ఉండి కూడా రావొచ్చు. ఉత్తరాఖండ్‌లో ఓ జైలు ఈ అవకాశాన్ని ఇస్తుంది.
Samayam Telugu Jail


ఉత్తరాఖండ్ జైల్లో నేరం చేయని వారు కూడా వెళ్లి ఉండొచ్చు. ఒక రోజుకు రూ.500లు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా రూ.500లు ఇచ్చి ఎన్నిరోజులైనా ఉండొచ్చని జైలు సూపరింటెండెంట్ తెలిపారు. అయితే దీనికోసం ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా జైల్లోఉండాలనుకుంటే.. గది లభిస్తుందని, దీనికి అనుమతి ఇవ్వాలంటే అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని హల్ద్వానీ జైలు సూపరింటెండెంట్ చెప్పారు. ఈ మేరకు జైల్లో వినియోగించని కొంత భాగం ఉందని, దానిని డమ్మీ జైలుగా అభివృద్ధి చేస్తామని, దానికి రూ. 500లకు అద్దెకిస్తామిన చెప్పారు.


దీంతో జైలు గదిని అద్దెకు ఇచ్చే మొట్టమొదటి జైలుగా హల్ద్వానీ జైలు నిలిచింది. అయితే ఇలా జైలును అద్దెకు ఇవ్వాలనే ఆలోచన రావడానికి ఒక కారణం ఉంది. కొంతమంది జాతకాలను ఎక్కువగా నమ్ముతుంటారు. జాతక దోషాల వల్ల.. పెళ్లిళ్లు కాకపోవడం, ఉద్యోగాలు పోవడం వంటివి జరుగుతుంటాయని కొందరి నమ్మకం. అలాంటి దోషాల నివారణ కోసం జైల్లో కొన్ని రోజులు ఉండాలని కొందరి జాతకాల్లో ఉంటుంది. అలాంటి వారి సమస్యను తీర్చడానికి ఉత్తరాఖండ్ పోలీసులు బంధన్ యోగ్ పేరుతో ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు.

Read Also:ముస్లింలు ఉండే వీధిలో దుర్గాపూజ... ఎందుకో తెలిస్తే భేష్ అంటారు..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.