యాప్నగరం

భార్యలని అద్దెకిచ్చే భర్తలు.. అందం, వయసుని బట్టి రేటు.! దురాచారం

పేద మహిళలను డబ్బులున్న వ్యక్తులు అద్దెకు తీసుకెళ్తారు. ఆమె అందం, వయసుని బట్టి భర్తలకు అద్దె చెల్లిస్తారు. అందుకోసం రాతపూర్వకంగా అగ్రిమెంట్ కూడా చేసుకుంటారు. ఆమె అతనితో అన్ని పనులూ చేయాల్సి ఉంటుంది.

Samayam Telugu 26 Jan 2021, 6:06 pm
మహిళలను దేవతలుగా, ఆదిపరాశక్తులుగా కొలిచే సనాతన భారతీయ సంప్రదాయం.. గ్రంథాలు, పుస్తకాలకే పరిమితమైపోయింది. స్త్రీ మూర్తులను గౌరవించాలని బోధించిన మన పురాతన విద్యావిధానం కనుమరుగైంది. ఫలితంగా అత్యాచారాలు.. హత్యలు చూస్తూనే ఉన్నాం. దేశంలో మహిళలపై లైంగిక వేధింపులు.. అత్యాచారాలు సర్వసాధారణమైపోయాయంటే అబద్ధం కాదేమో!! నిత్యం ఏదో ఒకచోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూ ఉండడమే అందుకు నిదర్శనం. కామంతో కళ్లు మూసుకుపోయిన మృగాళ్లు ఆడవాళ్లపై అఘాయిత్యాలకు తెగబడుతుంటే.. మరోవైపు ఆచారాల పేరుతో మహిళలను పడక సుఖం పంచే వస్తువులుగా మార్చేసే దురాచారాలు రాజ్యమేలుతున్నాయి. భార్యలను.. కట్టుకున్న భర్తలే పరాయి మగాళ్లకు రేటు కట్టి మరీ అమ్మేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోదసిలోకి రాకెట్లు పంపేంత ఘనత సాధించినా మన సమాజంలో వేళ్లూనుకుపోయిన దురాచారాలను రూపుమాడంలో మాత్రం ఇంకా వెనకబడే ఉన్నామని మధ్యప్రదేశ్‌లో అమల్లో ఉన్న దడీచ ప్రథ వేలెత్తి చూపుతూనే ఉంటుంది!!
Samayam Telugu rich men can rent a wife on a monthly or yearly basis
భార్యలని అద్దెకిచ్చే భర్తలు.. అందం, వయసుని బట్టి రేటు.! దురాచారం


ఆటవిక ఆచారం

రాజ్‌పుట్‌లు ఎక్కువగా నివాసముండే పాత గ్వాలియర్ రాజసంస్థానం పరిధిలోని శివపురి జిల్లాలో ఆటవిక ఆచారం రాజ్యమేలుతోంది. పేదోళ్ల భార్యలను డబ్బున్నోళ్లు అద్దెకు తీసుకునే అమానుష ఆచారం అమలవుతోంది. అక్కడి ధనవంతులు పేద మహిళలను డబ్బులిచ్చి అద్దెకు తీసుకెళ్లే దురాచారం నడుస్తోంది. అక్కడ కట్టుకున్న భర్తలే భార్యలను అద్దెకిచ్చేస్తారు. పది రూపాయల నుంచి లక్షల రూపాయల వరకూ రేటు కట్టి మరీ బడాబాబులకు భార్యలను అప్పగిస్తారు. ఆమె వయసు.. అందంపై ఆ రేటు ఆధారపడి ఉంటుంది. నెల రోజులకొక ధర, సంవత్సారానికైతే మరో రేటు చొప్పున భర్తలే పరాయి మగాళ్లతో పంపిస్తారు.

భర్తతో అగ్రిమెంట్.!

నెల రోజులు.. ఏడాదికి మహిళలను అద్దెకు తీసుకుంటారు డబ్బున్న బడాబాబులు. ప్రధానంగా యుక్తవయస్సు అమ్మాయిల నుంచి 35 ఏళ్లలోపు మహిళలను మాత్రమే ఎంచుకుంటారు. ఆమెను అద్దెకు తీసుకుంటున్నట్లు రాతపూర్వక అగ్రిమెంట్ రాసుకోవడం విశేషం. అందుకోసం బ్రోకర్ల వ్యవస్థ కూడా ఉందట. వారే మధ్యలో ఉండి భర్తకి.. అతని భార్యను అద్దెకు తీసుకునే వ్యక్తికి డీల్ కుదుర్చుతారు. ఒకసారి ఆమెను అద్దెకు తీసుకున్న తర్వాత అగ్రిమెంట్‌లో ఉన్న ప్రకారం ఆమె సేవలు చేయాల్సి ఉంటుంది. అద్దెకు తీసుకున్న వ్యక్తికి పడక సుఖంతో పాటు ఇంటి పనులు కూడా చేయాల్సి ఉంటుందట.

గుజరాత్‌లోనూ..

అయితే ఈ దురాచారం ఒక్క మధ్యప్రదేశ్‌లోని శివపురిలోనే కాదు. గుజరాత్‌లోని వెనకబడిన ప్రాంతంలోనూ ఉందని తెలుస్తోంది. గుజరాత్‌కి చెందిన ఓ వ్యవసాయ కూలీ తన భార్యను ఓ జమీందార్‌కి నెల రోజులు అద్దెకు ఇచ్చాడు. అందుకు ప్రతిఫలంగా అతని నెల జీతానికి పది రెట్లు జమీందార్ ఇచ్చినట్లు సమాచారం. ఈ అరాచకాలు.. అగ్రిమెంట్ల వ్యవహారం అక్కడి అధికారులకు తెలిసినా పట్టించుకోరు. మహిళల ఆత్మగౌరవానికి అక్కడ విలువే ఉండదు. భార్యలను అంగట్లో వస్తువులా అద్దెకివ్వడం అక్కడ అలవాటుగా మారిపోయింది. ఇలాంటి నీచ ఆచారాలు ఎప్పటికి కనుమరుగవుతాయో చూడాలి!!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.