యాప్నగరం

దేశ ఆస్తులకు గాంధీల పేర్లెందుకు పెట్టాలి?

గాంధీ కుటుంబ పేర్లను కీలక ఆస్తులకు ఎందుకు పెట్టాలని ప్రశ్నిస్తున్నారు రిషికపూర్

TNN 18 May 2016, 12:42 pm
బాలీవుడ్ సీనియర్ నటుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉన్న కీలక ఆస్తులకు గాంధీ కుటుంబంలోని వ్యక్తుల పేర్లు ఎందుకు పెట్టాలంటూ ప్రశ్నించారు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పెట్టిన పేర్లన్నింటినీ మార్చాలని అన్నారు. ఇందిరా గాంధీ రోడ్డు, రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు... ఇలా పెట్టాల్సిన అవసరం ఏముందని... తాను అందుకు అంగీకరించనని అన్నారు. ఆ ఆస్తులు వారి అయ్య సొత్తా... అని ప్రశ్నించారు. దేశంలోని ఆస్తులకు మహాత్మా గాంధీ పేరో, అంబేద్కర్, భగత్ సింగ్ పేరో ఎందుకు పెట్టరని ట్విట్టర్లో ప్రశ్నించారు. ఢిల్లీలోని అక్బర్ రోడ్డు పేరును మార్చి మహారాణా ప్రతాప్ రోడ్డుగా మార్చాలంటూ కేంద్రమంత్రి వీకే సింగ్ ప్రతిపాదన చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రిషి కపూర్ తన అభిప్రాయలను ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. బాంద్రా,వర్లీ సీలింక్ కు లతా మంగేష్కర్ పేరు లేదా టాటా పేరు పెట్టాలని ప్రతిపాదించారు. ఛండీఘడ్ లో రాజీవ్ గాంధీ పేరు పెట్టాలసిన అవసరం ఏముందని అన్నారు. తన తండ్రి రాజ్ కపూర్ దేశం గర్వించే వ్యక్తని అన్నారు.
Samayam Telugu rishi kapoor why is every national asset named after the gandhis
దేశ ఆస్తులకు గాంధీల పేర్లెందుకు పెట్టాలి?


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.