యాప్నగరం

శశికి టోపీ, పన్నీరుకు విద్యుత్ స్థంభం ఇచ్చిన ఈసీ!

జయలలిత మరణానంతరం... ఆర్కేనగర్ లో ఉపఎన్నిక జరుగనున్న సంగతి తెలిసిందే.

TNN 23 Mar 2017, 12:34 pm
జయలలిత మరణానంతరం... ఆమె నియోజకవర్గమైన ఆర్కేనగర్ లో ఉపఎన్నిక జరుగనున్న సంగతి తెలిసిందే. అన్నాడీఎంకే పార్టీ రెండు వర్గాలుగా విడిపోయి పార్టీ గుర్తయిన రెండాకులను తమకే కేటాయించాలంటూ ఈసీ గడపతొక్కింది. శశికళ వర్గం, పన్నీరు వర్గం ఆ రెండాకుల కోసం ఈసీని చాలాసార్లు కలిసింది. చివరికి బుధవారం రాత్రి ఈసీ తన నిర్ణయాన్ని ప్రకటించింది. రెండాకులను ప్రస్తుతానికి ఫ్రీజ్ చేస్తున్నట్టు చెప్పింది. ఆర్కేనగర్ ఉపఎన్నికలో పాల్గొనేందుకు శశి,పన్నీరు వర్గానికి కొత్త గుర్తులు ఇస్తామని చెప్పింది. రెండు వర్గాలు తమ పార్టీ పేరులను ప్రతిపాదించాలని కోరింది.
Samayam Telugu rknagar by poll ops gets electric pole sasikala gets hat
శశికి టోపీ, పన్నీరుకు విద్యుత్ స్థంభం ఇచ్చిన ఈసీ!


కాగా పన్నీర్‌ సెల్వం వర్గం తమ పార్టీని ‘అన్నాడీఎంకే పురట్చి తలైవి అమ్మా’గా, శశికళ వర్గం ‘అన్నాడీఎంకే అమ్మా’గా ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదించారు. గురువారం ఉదయం శశికళ, పన్నీరు వర్గాలకు గుర్తులను కేటాయించింది. శశికళ వర్గానికి టోపీని, పన్నీరుసెలం వర్గానికి విద్యుత్ స్థంభాన్ని కేటాయించింది. ఎన్నికల కమిషన్ ఈ ఆర్కేనగర్ ఉపఎన్నికలో అన్నాడీఎంకే పేరును ఎక్కడా వాడకూడదని ఇరు వర్గాలను ఆదేశించింది ఈసీ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.