యాప్నగరం

కోట్ల కొద్దీ బయటపడుతున్న నల్లధనం

టీటీడీ పాలకవర్గం సభ్యుడు శేఖర్ రెడ్డి దాచిన నల్లధనాన్ని ఐటీ అధికారులు వెలికితీస్తున్నారు.

TNN 9 Dec 2016, 8:20 pm
టీటీడీ పాలకవర్గం సభ్యుడు, తమిళనాడుకి చెందిన వ్యాపారవేత్త శేఖర్ రెడ్డి దాచిన నల్లధనాన్ని ఐటీ అధికారులు వెలికితీస్తున్నారు. చెన్నైలోని అతని ఇల్లు, కార్యాలయాలపై గురువారం దాడి చేసిన అధికారులు రూ.90కోట్ల వరకు కరెన్సీ, వంద కిలోల బంగారాన్ని పట్టుకున్న సంగతి తెలిసిందే. శుక్రవారం కూడా వందమందికి పైగా ఐటీ అధికారులు శేఖర్ రెడ్డి ఇల్లు, కార్యాలయాలపై దాడులు కొనసాగించారు. అతని అసోసియేట్ శ్రీనివాసరెడ్డి, ప్రేమ్ అనే ఏజెంట్ ఇళ్లపై సోదాలు చేశారు. చెన్నై, వెల్లూరు ప్రాంతాల్లోని తొమ్మిది చోట్ల చేసిన సోదాల్లో మరింత డబ్బు, బంగారం బయటపడింది.
Samayam Telugu rs 106 crore 127 kg gold found in income tax raids in chennai
కోట్ల కొద్దీ బయటపడుతున్న నల్లధనం


కాగా గురువారం సోదాలు చేస్తున్న సమయంలో శేఖర్ రెడ్డి ఇంట్లోని రెండు గదులు తాళం వేసి ఉన్నాయి. అవి తెరిచేందుకు తాళం చెవులు తన దగ్గర లేవని చెప్పాడు. అయితే అధికారులు తలుపులు బద్దలు కొట్టి మరీ లోపలికి వెళ్లగా కోట్ల కొద్దీ కరెన్సీ కట్టలు, బంగారు కడ్డీలు కనిపించాయి. వాటన్నింటినీ అధికారులు సీజ్ చేశారు. శేఖర్ రెడ్డి ఆ డబ్బంతా తనదేనని ఐటీ అధికారులకు తెలిపాడు. ఇప్పటివరకు సోదాల్లో రూ.106 కోట్ల రూపాయల నగదు, 127 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

శేఖర్ రెడ్డి తమిళనాడు రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ లో కాంట్రాక్టర్ గా ఉన్నాడు. అలాగే బయట కాంట్రాక్టు పనులు కూడా చేస్తుంటాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.