యాప్నగరం

మార్కెట్‌లోకి రూ.200, రూ.50 నోట్లు, కానీ....

పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు కొరత తీర్చేందుకు తొలిసారిగా రూ.200 నోట్లను శుక్రవారం నుంచి చలామణీలోకి తీసుకొస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే.

TNN 25 Aug 2017, 2:46 pm
పెద్ద నోట్ల రద్దు తర్వాత నగదు కొరత తీర్చేందుకు తొలిసారిగా రూ.200 నోట్లను శుక్రవారం నుంచి చలామణీలోకి తీసుకొస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. వీటిని బ్యాంకుల ద్వారా అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది. దీంతో ప్రజలు దిల్లీలోని రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా ప్రాంతీయ కార్యాలయం వద్ద నోట్ల కోసం కట్టారు. కొత్తగా ప్రవేశపెట్టిన రూ.200, రూ.50 నోట్లను చూపిస్తూ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నోట్లు ఎంపిక చేసిన కొన్ని బ్యాంకులు, రిజర్వు బ్యాంకు కార్యాలయాల్లో మాత్రమే లభ్యమవుతున్నాయి. ప్రస్తుతం ఇవి బ్యాంకుల ద్వారా మాత్రమే ప్రజలకు చేరతాయి. రూ. 200, రూ.50 నోట్లను ఏటీఎంల ద్వారా అందించాలంటే వాటిలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది.
Samayam Telugu rs 200 notes atms wont dispense new denomination just yet
మార్కెట్‌లోకి రూ.200, రూ.50 నోట్లు, కానీ....


దేశంలోని సమారు 2 లక్షల ఏటీఎం యంత్రాలను మార్పుచేయాల్సి ఉంటుంది. ఈ మార్పులు జరగాలంటే సుమారు వారం రోజులు సమయం అవసరం. రూ.200నోటు కంటే రూ.50నోటు పరిమాణం కొద్దిగా చిన్నగా ఉంది. మహాత్మాగాంధీ సిరీస్‌.. ఆర్బీఐ గవర్నరు ఉర్జిత్‌ పటేల్‌ సంతకంతో ఈ కొత్త నోట్లు చలామణిలోకి వచ్చాయి. పసుపు వర్ణంలో మెరుస్తున్న రూ.200 నోటు వెనుక వైపు భారతీయ వారసత్వానికి ప్రతీకగా సాంచి స్తూపం చిహ్నాన్ని ముద్రించారు. ఫ్లోరెసెంట్‌ బ్లూ కలర్‌లో ఉన్న రూ.50నోటు వెనక వైపు హంపీ రథాన్ని ముద్రించారు. ఈ రెండు నోట్లలో స్వచ్ఛభారత్‌ లోగో ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.