యాప్నగరం

హోటల్లో 3 కోట్ల రూపాయల పాతనోట్లు

ఎయిర్ పోర్టుల్లో స్కానింగ్ మిషన్లకు కూడా దొరక్కుండా ప్యాక్ చేసి..హవాల మార్గంలో సరఫరా చేసేందుకు ప్యాక్ చేసిన

Samayam Telugu 14 Dec 2016, 10:58 am
ఎయిర్ పోర్టుల్లో స్కానింగ్ మిషన్లకు కూడా దొరక్కుండా ప్యాక్ చేసి..హవాల మార్గంలో సరఫరా చేసేందుకు ప్యాక్ చేసిన రూ.3.25కోట్ల నగదు ఢిల్లీలోని బుధవారం ఉదయం ఓ హోటల్లో పట్టుబడింది.
Samayam Telugu rs 3 crores seized at karol bagh in delhi
హోటల్లో 3 కోట్ల రూపాయల పాతనోట్లు


పోలీసులకు పట్టుబడిన ఈ మొత్తం నగదు రద్దయిన పాత నోట్లలలోనే ఉండటం గమనార్హం. ఢిల్లీలోని కరోల్ బాగ్ లో ఉన్న తక్ష్ ఇన్ అనే హోటల్ పై పోలీసులు దాడి చేయగా ఐదురుగు వ్యక్తులు ఈ అమౌంట్ తో పట్టుబడ్డారు.

నగదునంతా సూటు కేసులు, కార్డ్ బోర్డుల్లో ప్యాక్ చేశారు విమానంలో ముంబైకి తరలించేందుకు నిందితులు సిద్ధమయ్యారు. ఇంత నగదును ఎయిర్ పోర్టు స్కానింగ్ యంత్రాలకు కూడా చిక్కకుండా ఉండేందుకు నైపుణ్యం ఉన్న వారిని నియమించుకున్నారు. సూట్ కేసుల, డబ్బాల్లో ప్యాక్ చేసి....వాటికి టేప్, వైర్లు చుట్టారు. కోరియర్లుగా నటిస్తూ నిందితులు ఈ డబ్బును తరలించేందుకు సిద్ధమైనప్పుడు..ఐటీ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు.

ఐదుగురిని అరెస్టు చేసిన పోలీసులు..వారి నుంచి సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బు ఎవరిదన్నా కోణంలో పోలీసులు విచారణ ప్రారంభించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.