యాప్నగరం

ప్రద్యుమన్ హత్య కేసు: బాలనేరస్థుడిని పెద్దవాడిగా ఎందుకు?

రెండు నెలల క్రితం గుర్గావ్‌లో సంచలనం సృష్టింటించిన రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి ప్రద్యుమన్ ఠాకూర్ హత్య కేసు గురించి తెలిసిందే.

TNN 21 Dec 2017, 11:53 am
రెండు నెలల క్రితం గుర్గావ్‌లో సంచలనం సృష్టింటించిన రేయాన్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి ప్రద్యుమన్ ఠాకూర్ హత్య కేసు గురించి తెలిసిందే. ఈ హత్యకేసులో అదే పాఠశాలకు చెందిన 11వ తరగతి విద్యార్థి నిందితుడని సీబీఐ విచారణలో తేలింది. అయితే ఇప్పుడు ఆ పదహారేళ్ల బాలనేరస్థుడు పెద్దవారిలానే కోర్టులో విచారణను ఎదుర్కోనున్నాడు. ఈ మేరకు నిందితుడిని పెద్దవాడిగానే పరిగణించాలని జువైనల్ జస్టిస్ బోర్డు బుధవారం స్పష్టం చేసింది. అందరు ఖైదీల్లానే అతన్ని డిసెంబర్ 22న కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. ఈ హత్యకేసులో నిందితుడికి శిక్షపడితే అతనికి 21 ఏళ్లు వచ్చేవరకు జువైనల్ హోంలో ఉంచి ఆ తర్వాత సాధారణ జైలుకు తరలించాలని తెలిపింది.
Samayam Telugu ryan murder case why juvenile will be tried as adult
ప్రద్యుమన్ హత్య కేసు: బాలనేరస్థుడిని పెద్దవాడిగా ఎందుకు?


16 ఏళ్ల బాలుడిని సాధారణ ఖైదీగా ఎందుకు..
స్కూల్‌లో రెండో తరగతి విద్యార్థి అయిన ప్రద్యుమన్‌ను 11వ తరగతి విద్యార్థి హత్యచేసినట్లు సీబీఐ తేల్చింది. అనంతరం ఆ బాలనేరస్థుడిని అరెస్టు చేసి జువైనల్ హోంకు తరలించారు. ఆ బాలనేరస్థుడిపై విచారణ చేపట్టిన జువైనల్ జస్టిస్ బోర్డుకు అతని గురించి భయంకరమైన నిజాలు తెలిసాయి. పాఠశాలలో అతని ప్రవర్తన చాలా ఇబ్బందికరంగా ఉండేదని టీచర్లే చెప్పారు. పరీక్షలను ఆపడానికి పాఠశాలలో ఉన్న మంచినీటి ట్యాంకులో విషయం కలపడానికి కూడా సిద్ధపడ్డాడని అధికారులకు వెల్లడించారు. ఆ విద్యార్థి ప్రవర్తన చాలా అతిగా ఉండేదని తేల్చారు. దీనికి తోడు అతని మానసిక పరిస్థితిపై కూడా అధికారులు విచారణ జరిపారు.

బాలనేరస్థుడి ఐక్యూ స్థాయి సాధారణంగా ఉందని, అతని తల్లిదండ్రులు నిరంతరం ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోనేవారని విచారణలో తేలింది. దీంతో అతనిపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకుండా పోయిందని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. మొత్తం మీద ఆ జువైనల్ షార్ట్ టెంపర్డ్ అని, హైపర్ అగ్రెసివ్ అని, తల్లిదండ్రులతో అతనికి సత్సంబంధాలు లేవని జువైనల్ జస్టిస్ బోర్డు నివేదిక స్పష్టం చేసింది. ఈ జువైనల్‌కి మద్యం సేవించే అలవాటు కూడా ఉందని పేర్కొన్నారు. ఒకసారి స్కూలు బయటే మద్యం సేవించి దొరికిపోయాడని, ఇతరులతో గొడవలు పెట్టుకోవడం కూడా ఎక్కువేనని నివేదిలో వెల్లడించారు. వీటన్నిటినీ పరిశీలించిన జువైనల్ జస్టిస్ బోర్డు అతన్ని పెద్దవాడిగానే పరిగణించాలని నిర్ణయించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.