యాప్నగరం

శబరిమల ఆలయం ఓపెన్.. పంబలో ఉద్రిక్తత

తెరుచుకున్న శబరిమల ఆలయం.. శుద్ధి తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పూజారులు. ఆదివారం నుంచి భక్తులకు అనుమతి. పంబకు చేరుకున్న మహిళల్ని వెనక్కు తిప్పి పంపిన పోలీసులు.

Samayam Telugu 16 Nov 2019, 5:37 pm
కేరళలో శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకుంది. ప్రధాన పూజారి కండారు మహేశ్‌ మోహనారు.. ముఖ్య పూజారి ఏకే సుధీర్‌ నంబూద్రి శుద్ధి నిర్వహించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గర్భగుడిని తెరిచారు. ఇవాల్టి నుంచి డిసెంబర్‌ 27 వరకు స్వామివారికి నిత్య పూజలు జరుగుతాయి. ఆదివారం నుంచి భక్తులకు ప్రవేశం కల్పించనున్నారు. ఇటు పంబ నుంచి దీక్ష స్వీకరించిన స్వాములు స్వామివారి దర్శనానికి బయల్దేరారు.. ఆదివారం అయ్యప్పను దర్శించుకోనున్నారు.
Samayam Telugu sabarimala.

ఇటు ఆలయం తెరుచుకోవడంతో.. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తదనంతర పరిణామాలతో ముందుగానే అప్రమత్తమయ్యారు.. భారీగా భద్రతా ఏర్పాట్లు చేసింది. మరోవైపు శనివారం ఆలయంలోకి ప్రవేశించేందుకు వచ్చిన పది మంది మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని అక్కడి నుంచి వెనక్కు తిప్పి పంపారు.. దీంతో పోలీసులతో మహిళలు వాగ్వాదానికి దిగారు.

శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టులో విచారణ జరిగిన సంగతి తెలిసిందే. గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని దాఖలైన పిటిషన్లను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. గతేడాది ఇచ్చిన తీర్పుపై స్టే విధించేందుకు నిరాకరించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.