యాప్నగరం

Sabarimala: కేరళ హైకోర్టు ఆదేశాలతో శబరిమల ఆలయ ప్రసాదం నిలిపివేత.. ఎందుకంటే !

Sabarimala: శబరిమల ఆలయంలో భక్తులు పవిత్రంగా భావించే అరవణ ప్రసాదం విక్రయాలు నిలిచిపోయాయి. ప్రసాదం తయారీలో వినియోగించే యాలకుల్లో మోతాదుకు మించి రసాయనాలు ఉన్నట్లు తేలటంతో ప్రసాద విక్రయాలు నిలిపవేయాలని కేరళ హైకోర్టు ట్రావెన్‌కోర్‌ దేవస్వమ్‌ బోర్డును ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రసాద విక్రయాలు నిలిపివేశారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 12 Jan 2023, 1:15 pm

ప్రధానాంశాలు:

  • శబరిమల ఆలయ ప్రసాదం నిలివేత
  • మెతాదుకు మించి రసాయనాలతో నిర్ణయం
  • దేవస్థానం బోర్డును ఆదేశించిన హైకోర్టు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Sabarimala Temple
శబరిమల ఆలయ ప్రసాదం
Sabarimala:శబరిమల అరవణ ప్రసాదం విక్రయాలు నిలిచిపోయాయి. ప్రసాదం తయారీలో వినియోగించే యాలకుల్లో మోతాదుకు మించి రసాయనాలు ఉన్నట్లు ఆహార భద్రతా, ప్రమాణ ప్రాధికార సంస్థ (FSSAI) నివేదిక ఇచ్చింది. దీంతో ఈ ప్రసాదం విక్రయాలను నిలిపివేయాలని కేరళ హైకోర్టు ట్రావెన్‌కోర్‌ దేవస్వమ్‌ బోర్డు (Travancore Devaswom Board)ను ఆదేశించింది. కోర్టు తీర్పు మేరకు బుధవారం అరవణ ప్రసాదం విక్రయాలు నిలిపివేశారు. అరవణ పాయసం తయారీలో ఆహార భద్రత ప్రమాణాలు పాటించడం లేదని కోర్టు పేర్కొంది. ప్రసాదం రుచికి ఉపయోగించే యాలకుల్లో మెతాదుకు మించి పురుగు మందు అవశేషాలు ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలోనే ప్రసాదం పంపిణీ నిలిపివేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
శబరిమల ప్రసాదంలో వినియోగించే యాలకులను ట్రావెన్‌కోర్ బోర్డు గతంలో అయ్యప్ప స్పైసెస్‌ అనే కంపెనీ నుంచి కొనుగోలు చేసింది. అయితే 2022-23 సీజన్‌లో ఈ యాలకుల కాంట్రాక్టును కొల్లాంకు చెందిన ఓ సప్లయర్‌కు బోర్డు అక్రమంగా అప్పగించిందని అయ్యప్ప స్పైసెస్‌ కంపెనీ ఆరోపించింది. యాలకుల నాణ్యతపై అయ్యప్ప స్పైసెస్‌ కంపెనీ ఫిర్యాదు చేయడంతో ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్‌ ఇండియా (FSSAI) లాబొరేటరీలో పరీక్షలు నిర్వహించారు. పరీక్షల్లో పరిమితికి మంచి రసాయనాలు ఉన్నట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నివేదిక ఇచ్చింది.

నివేదిక ఆధారంగా విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ప్రసాదం విక్రయాలపై మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రసాదం విక్రయాలు నిలిపివేయాలని ట్రావెన్‌కోర్‌ దేవస్వమ్‌ బోర్డును కోర్టు ఆదేశించింది. అయితే, యాలకులు లేకుండా చేసిన ప్రసాదం లేదా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రమాణాలకు అనుగుణంగా కొనుగోలు చేసిన యాలకులతో తయారుచేసిన ప్రసాదాన్ని విక్రయించుకోవచ్చని కోర్టు.. ట్రావెన్‌కోర్‌ దేవస్వమ్‌ బోర్డుకు సూచించింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను జనవరి 13వ తేదీకి వాయిదా వేసింది.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.