యాప్నగరం

లవ్ ఫెయిల్యూర్, తీవ్రవాదిగా మారిన సబ్జర్

శనివారం ఇండియన్ ఆర్మీ బలగాల చేతిలో హతమైన హిజ్బుల్ ముజాయీదీన్ తీవ్రవాది సబ్జర్ అహ్మాద్ భట్

TNN 27 May 2017, 8:03 pm
శనివారం ఇండియన్ ఆర్మీ బలగాల చేతిలో హతమైన హిజ్బుల్ ముజాహిదీన్ తీవ్రవాది సబ్జర్ అహ్మాద్ భట్ ప్రేమలో విఫలమవడంతో టెర్రరిస్టు గ్రూపులో చేరినట్లు తెలిసింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. దక్షిణ కశ్మీర్ లోని త్రాల్ ప్రాంతంలోని రాస్తున గ్రామానికి చెందిన సబ్జర్ 15 ఏళ్ల వయసులో తుపాకి పట్టాడు.
Samayam Telugu sabzar ahmad became terrorist after failed love
లవ్ ఫెయిల్యూర్, తీవ్రవాదిగా మారిన సబ్జర్


స్థానికంగా ఓ యువతిని ప్రేమించిన సబ్జర్.. పెళ్లి చేసుకోవడాన్ని ఆమె తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో కలత చెందాడు. అదేసమయంలో బుర్హన్ వనీ సోదరుడు ఖలీద్ ను 2015 లో పోలీసులు ఎన్ కౌంటర్ జరగడంతో.. సైనిక బలగాలపై సబ్జర్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అదే ఏడాది ఏప్రిల్ లో ఓ పోలీసు దగ్గర తుపాకి దొంగలించి హిజ్బుల్ ముజయీదీన్ సంస్థలో చేరాడు.

హిజ్బుల్ ముజాహిదీన్ లో చేరిన బుర్హన్ వనీకి చేరువయ్యాడు. గతేడాది జులైలో సైనికల బలగాల ఎన్ కౌంటర్ లో వనీ హతమయ్యాడు. అతడి ఎన్ కౌంటర్ తర్వాత సబ్జర్ వనీ వారసుడిగా ముజాహిదీన్ కార్యకలాపాలను కొనసాగించాడు.

శనివారం పోలీసులు, ఆర్మీ సంయుక్తంగా నిర్వహించిన ఎటాక్ లో మృత్యువాత పడ్డారు. అతడితో పాటు మరో తొమ్మిది తీవ్రవాదుల్ని భారత బలగాలు మట్టుబెట్టాయి.

సబ్జర్ మృతితో త్రాల్ ప్రాంతంలో శనివారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానికులు పోలీసులు, సైనికులపై రాళ్లు రువ్వారు. ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలు నిలిపేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.