యాప్నగరం

సచిన్‌పై కాంగ్రెస్ ఫైర్.. రాజ్యసభ వాయిదా!

సచిన్ టెండూల్కర్ పై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు.

TNN 22 Dec 2017, 2:37 pm
భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు, రాజ్యసభ ఎంపీ సచిన్ టెండూల్కర్ పై కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. రాజ్యసభలో పరిణామాల పట్ల స్పందిస్తూ వీరు సచిన్ తీరును ఖండించారు. సచిన్ తీరును తప్పు పట్టిన నేతల్లో రేణుకా చౌదరి కూడా ఉండటం విశేషం. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ అయిన ఈ తెలుగు నేత.. మీడియాతో మాట్లాడుతూ.. ఒకవైపు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ప్రధాని మోడీ క్షమాపణలు చెప్పాలంటూ తాము డిమాండ్ చేస్తున్న వేళ సచిన్ సభలో ప్రసంగించాలని చూడటం తప్పు అని ఈమె అభిప్రాయపడ్డారు.
Samayam Telugu sachin out for duck in rajya sabha
సచిన్‌పై కాంగ్రెస్ ఫైర్.. రాజ్యసభ వాయిదా!


సచిన్ భారతరత్న అయితే అయ్యుండొచ్చు అని, భారతరత్న అవార్డు పొందితే సభలో ఎప్పుడైనా ప్రసంగించేయవచ్చా? అని ఆమె ప్రశ్నించారు. ఒకవైపు సచిన్ ను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందని, అలాంటి ఆటగాడిని, భారతరత్న పురస్కారాన్ని పొందిన వ్యక్తిని సభలో ప్రసంగించనీయకుండా కాంగ్రెస్ పార్టీ ఆయనను అవమానిస్తోందని బీజేపీ నేతలు అంటున్నారు. అయితే మన్మోహన్ కు మోడీ క్షమాపణలు చెప్పేంత వరకూ సభను జరగనిచ్చేది లేదని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. రేణుకాచౌదరి ఇదే మాటే చెప్పారు.

శుక్రవారం సభ ప్రారంభం కావడంతోనే మళ్లీ ఇదే గొడవ చెలరేగింది. గుజరాత్ ఎన్నికల ప్రచార సమయంలో మన్మోహన్ పై చేసిన వ్యాఖ్యలకు గానూ మోడీ క్షమాపణలు చెప్పాలన్న తమ డిమాండ్ తో నినాదాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఈ గొడవ ఎంతకూ సద్దుమణగకపోవడంతో... సభను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేశారు చైర్మన్ వెంకయ్య నాయుడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.