యాప్నగరం

సానియా మీర్జాకు సర్వీస్ టాక్స్ డిపార్ట్‌మెంట్ సమన్లు

హైదరాబాదీ స్టార్ టెన్నిస్ ప్లేయర్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జాకు సర్వీస్ టాక్స్ డిపార్ట్‌మెంట్..

TNN 9 Feb 2017, 11:50 am
హైదరాబాదీ స్టార్ టెన్నిస్ ప్లేయర్, తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జాకు సర్వీస్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నోటీసులు జారీ చేసింది. సానియా మీర్జా సర్వీస్ టాక్స్ ఎగ్గొట్టారని ఈ నోటీసుల్లో ఆరోపించిన సర్వీస్ టాక్స్ విభాగం.. పన్ను ఎగవేతకు గల కారణాలపై వివరణ ఇస్తూ సంబంధిత డాక్యుమెంట్లతో ఫిబ్రవరి 16న తమ ముందు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసుల్లో పేర్కొంది.
Samayam Telugu sania mirza she has been summoned by service tax department in tax evasion
సానియా మీర్జాకు సర్వీస్ టాక్స్ డిపార్ట్‌మెంట్ సమన్లు


సర్వీస్ టాక్స్ విభాగం ప్రిన్సిపల్ కమిషనర్ నుంచి ఫిబ్రవరి 6వ తేదీనే ఈ నోటీసులు జారీ అవగా.. " ఫిబ్రవరి 16వ తేదీన సానియా మీర్జా కానీ లేదా ఆమె తరపున ప్రతినిధి ఎవరైనా సంబంధిత డాక్యుమెంట్లతో కమిషన్ ముందు హాజరు కావాల్సిందిగా" ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఫైనాన్స్ యాక్ట్ 1994 ప్రకారం పన్ను ఎగవేతదారులు విచారణార్హులు అయినందున సానియా మీర్జా కమిషన్ ముందు హజరు కావాల్సిందేనని సదరు సమన్లలో సర్వీస్ టాక్స్ విభాగం స్పష్టంచేసింది.

ఒకవేళ ఈ సమన్లకు స్పందించకపోయినా, లేదా ఉద్దేశపూర్వకంగా గైర్హాజరయినా లేదా సంబంధిత దస్త్రాలు సమర్పించడంలో విఫలమైనా.. చట్టం ప్రకారం శిక్షార్హులు అవుతారు అని సర్వీస్ టాక్స్ విభాగం అధికారులు ఈ సమన్లలో పేర్కొన్నారు. అయితే, ఇంతకీ ఏ వ్యవహారంలో సానియా మీర్జా పన్ను ఎగవేశారనే విషయంలో మాత్రం సర్వీస్ టాక్స్ విభాగం ఈ సమన్లలో స్పష్టత ఇవ్వలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.