యాప్నగరం

జైల్లో శశికళ చేసే పనేంటి? ఆమెకొచ్చే వేతనం ఎంత ?

దశాబ్ధాలపాటు దివంగత ముఖ్యమంత్రి జయలలితతోపాటు పోయెస్ గార్డెన్‌లో సకల రాజభోగాలు...

TNN 16 Feb 2017, 10:24 am
దశాబ్ధాలపాటు దివంగత ముఖ్యమంత్రి జయలలితతోపాటు పోయెస్ గార్డెన్‌లో సకల రాజభోగాలు అనుభవించిన శశికళ ఇకపై నాలుగేళ్లపాటు బెంగుళూరులోని పరప్పణ అగ్రహార జైలులో సాధారణ ఖైదీగా జీవితం గడపనుంది. ఓ ఫ్యాన్, తలగడ, బ్లాంకెట్, బెడ్ షీట్, ఓ ప్లాస్టిక్ నీళ్ల బిందె, లేదా నీళ్లకుండ... ఇవీ శశికళకి ఆమె వుండే సెల్‌లో ఇచ్చే సౌకర్యాలు.
Samayam Telugu sasikala cm aspirant will make candles or agarbathis during her sentence
జైల్లో శశికళ చేసే పనేంటి? ఆమెకొచ్చే వేతనం ఎంత ?


శశికళతోపాటు ఇద్దరు ఖైదీలు ఇదే సెల్‌లో వుండనున్నారు. రోజూ రెండు న్యూస్ పేపర్లు చదువుకునే అవకాశం ఈమెకున్న మరో సౌకర్యం. జైలులోకి వెళ్లేటప్పుడు శశికళ వద్ద వున్న బంగారు గొలుసు, వాచ్ వంటివి స్వాధీనం చేసుకున్న జైలు అధికారులు.. ఆమెకు మూడు చీరలు, మూడు బ్లౌజులు ఇచ్చారు.

మూడు రోజుల క్రితం వరకు తమిళనాడు రాష్ట్రానికి సీఎం కావాలనేదే శశికళ ముందున్న కల. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. తమిళనాడు రాష్ట్రాన్ని తిరుగులేని మహారాణిలా ఏలాలనుకున్న శశికళ ఇకపై పొరుగు రాష్ట్రంలోని సెంట్రల్ జైలులో క్యాండిల్స్, అగర్ బత్తీలు తయారు చేసుకుంటూ కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకుగాను ఆమెకి రోజుకి రూ.50 రోజువారీ వేతనంగా అందనుంది. మరి వీక్ ఆఫ్ రోజు కూడా ఈ వేతనం వస్తుందా అని అనుకోకండి. ఎందుకంటే ఇక్కడ వీక్ ఆఫ్ లు వుండవు మరి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.