యాప్నగరం

మంత్రులతో శశికళ అత్యవసర సమావేశం

తమిళనాడులో రాజకీయ పరిణామాలు మళ్లీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

TNN 2 Jan 2017, 8:23 pm
తమిళనాడులో రాజకీయ పరిణామాలు మళ్లీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలే అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన శశికళ తన పట్టు బిగిస్తోంది. సీఎం కుర్చీవైపు అడుగులు వేసే దిశగా ప్రయత్నాలు కూడా మొదలుపెట్టినట్టు కనిపిస్తోంది. అందుకు ఊతమిచ్చేలా... సోమవారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో పోయెస్ గార్డెన్ లో మంత్రులతో సమావేశమైంది. ఈ సమావేశానికి 17 మంది మంత్రులు హాజరయ్యారు. పన్నీరు సెల్వం పదవికి ఎసరు పెట్టడం ఖాయమన్న అభిప్రాయాలు ఉన్నాయి. పన్నీరుసెల్వం సీఎం పదవికి ఏ క్షణమైనా రాజీనామా చేస్తారనే వార్తలు ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియరాలేదు.
Samayam Telugu sasikala hold emergency meeting with ministers at poes garden
మంత్రులతో శశికళ అత్యవసర సమావేశం


ఇప్పటికే అయిదుగురు మంత్రులు శశికళ సీఎం అవ్వాలంటూ బహిరంగంగా మాట్లాడారు. తాజగా లోక్ సభ డిప్యూటీ స్పీకర్ ఎం తంబిదురై కూడా శశికళే సీఎం అంటూ ప్రకటన విడుదల చేశారు. ఇవన్నీ శశికళ ప్లాన్ ప్రకారమే చేస్తున్నట్టు కూడా ఒక వాదన ప్రచారంలో ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.