యాప్నగరం

ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర: శశికళ భర్త

తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోందని చిన్నమ్మ భర్త నటరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Samayam Telugu 17 Jan 2017, 9:00 am
తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నిస్తోందని చిన్నమ్మ భర్త నటరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రాన్ని కాషాయీకరణ చేసేందుకు భాజపా కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. అయితే బీజేపీ కుట్రలను తిప్పికొడతామని నటరాజన్ అన్నారు. తాము కుటుంబ రాజకీయాలే చేస్తున్నామని ఆయన బాహటంగానే ప్రకటించారు . ఇందులో ఎలాంటి దాపరికం లేదని పేర్కొన్నారు.
Samayam Telugu sasikala husband m natarajan accuses bjp of trying to destabilise aiadmk government
ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర: శశికళ భర్త


ఎంజీఆర్ మరణం తర్వాత జయలలితను తామే కాపాడామని తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం సమర్థంగానే బాధ్యతలు నిర్వహిస్తున్నారని, ఇప్పట్లో ఆయన్ను మార్చే ప్రసక్తే లేదని అన్నారు. శశికళ సీఎం పీఠం అధిరోహించాలా? వద్దా? అనేది ఎంఎల్‌ఏల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తోన్న వ్యతిరేక శక్తుల కుట్రలను కలిసికట్టుగా ఎదుర్కోవాలని అన్నాడీఎంకే నాయకులకు, కార్యకర్తలకు నటరాజన్ పిలుపునిచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.