యాప్నగరం

‘బలపరీక్ష’ రోజు చిన్నమ్మ.. అలా గడిపేశారు!

జైలు శిక్ష ఖరారు కాగానే... ఎంతో చాకచక్యంగా పావులు కదిపిన చిన్నమ్మ, బలపరీక్షలో పైచేయి సాధించి తన పంతం నెగ్గించుకున్న సంగతి తెలిసిందే. శనివారం తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష జరుగుతున్న సమయంలో చిన్నమ్మ చాలా టెన్షన్‌గా....

TNN 19 Feb 2017, 6:32 pm
జైలు శిక్ష ఖరారు కాగానే... ఎంతో చాకచక్యంగా పావులు కదిపిన చిన్నమ్మ, బలపరీక్షలో పైచేయి సాధించి తన పంతం నెగ్గించుకున్న సంగతి తెలిసిందే. శనివారం తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష జరుగుతున్న సమయంలో చిన్నమ్మ చాలా టెన్షన్‌గా జైల్లో గడిపారు. అయితే, అసెంబ్లీలో పరిణామాలను ఎప్పటికప్పుడు ఆమె తెలుసుకుంటూనే ఉన్నారు.
Samayam Telugu sasikala keeping close eyes on tamilnadu politics glued to television
‘బలపరీక్ష’ రోజు చిన్నమ్మ.. అలా గడిపేశారు!


బెంగళూరు జైల్లో శశికళకు కేటాయించిన గదిలో టీవీ లేదు. దీనిపై ఆమె జైలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు టీవీ ఏర్పాటు చేయాలని గురువారం కోరారు. దీంతో, జైల్లోనే వేరొక గదిలో టీవీ ఏర్పాటు చేశారు. శనివారమంతా శశికళ టీవీలో వార్తలు చూస్తూ ఆ గదిలోనే గడిపారు. బలపరీక్షలో పళనిస్వామి వర్గం గెలిచిన తర్వాత శశికళ చాలా ఆనందంగా కనిపించారట. జైలు అధికారుల అనుమతితో పళనిస్వామికి ఫోన్ చేసి అభినందించడంతోపాటు మంత్రివర్గంతో కూడా మాట్లాడినట్లు తెలిసింది.

రాత్రి సుమారు 7 గంటలకు ఆమె తిరిగి తన గదికి వెళ్లిపోయారు. శశికళకు జైల్లో ‘ఎ’ క్లాస్ సదుపాయాలు కల్పించాలని ఆమె లాయర్ డిమాండు చేస్తున్నారు. ఆమెకు వయస్సు పైబడటంతో పాటు మధుమేహం వ్యాధి కూడా ఉండటంతో తగిన సదుపాయాలు క్పలించాల్సిన అవసరం ఉందని వాదిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.