యాప్నగరం

ప్రభుత్వ ఏర్పాటుకు మాకు అవకాశం ఇవ్వండి: శశికళ

తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్‌రావుతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ భేటీ ముగిసింది.

TNN 9 Feb 2017, 8:28 pm
తమిళనాడు గవర్నర్ విద్యాసాగర్‌రావుతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ భేటీ ముగిసింది. రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సుమారు 30 నిమిషాలు సమావేశమైన శశికళ ఆమెను శాసనసభా పక్ష నేత ఎన్నుకొంటూ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపిన లేఖను ఆయనకు అందజేసారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని గవర్నర్‌ను శశికళ కోరారు. శశికళ వెంట 10 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌కు వెళ్లారు.
Samayam Telugu sasikala meets governor stakes claim to form the government
ప్రభుత్వ ఏర్పాటుకు మాకు అవకాశం ఇవ్వండి: శశికళ


కాగా, సమావేశం జరుగుతున్నంతసేపు రాజ్‌భవన్ బయట అన్నాడీఎంకే కార్యకర్తలు శశికళకు మద్దతుగా నినాదాలు చేసారు. చిన్నమ్మే మనకు కాబోయే ముఖ్యమంత్రి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. అయితే పన్నీర్ సెల్వం, శశికళ వరసగా గవర్నర్‌తో భేటీ కావడంతో తమిళ రాజకీయం మరింత వేడెక్కింది. తరవాత తమిళనాడులో ఏం జరగబోతోందని యావత్తు భారతదేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

అయితే తమిళనాడు ముఖ్యమంత్రి విషయంపై నిర్ణయం తీసుకోవడానికి గవర్నర్ మరికొంత సమయం తీసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు అక్రమాస్తుల కేసులో శశికళపై సుప్రీం కోర్టు త్వరలో తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో అప్పటి వరకు వేచి చూసే యోచనలో గవర్నర్ ఉన్నట్టు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.