యాప్నగరం

జల్లికట్టు కోసం మోడీకి శశికళ లేఖ

తమిళనాడులో సంక్రాంతికి జల్లికట్టు ఆడడం ప్రాచీన కాలంగా ఆనవాయితీగా వస్తోంది.

TNN 11 Jan 2017, 3:18 pm
తమిళనాడులో సంక్రాంతికి జల్లికట్టు ఆడడం ప్రాచీన కాలంగా ఆనవాయితీగా వస్తోంది. జల్లికట్టులో ఎద్దుల్ని పరిగెట్టించి వాటి వెనుక వందల మంది పరిగెడుతూ వాటిని లొంగదీస్తారు. ఈ క్రమంలో వాటిని కొట్టడం, కర్రలతో పొడవడం వంటివి కూడా జరుగుతున్నాయి. దీనిపై జంతు సంరక్షణ కేంద్రాలు, సంస్థలు కోర్టుకు వెళ్లడంతో 2014లో జల్లికట్టుపై నిషేధం విధించారు. కాగా మరో మూడు రోజుల్లో సంక్రాంతికి వస్తుండడంతో జల్లికట్టు ఆడేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి శశికళ మోడీకి లేఖ రాశారు. జల్లికట్టుపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ ఆర్డినెన్స్ తేవాలని లేఖలో కోరారు. జల్లికట్టు అనేది తమిళులకు సంప్రదాయ క్రీడ అని దీనిని నిర్వహించడం పండుగగా భావిస్తారని లేఖలో పేర్కొన్నారు.
Samayam Telugu sasikala writes letter to pm modi on jallikattu
జల్లికట్టు కోసం మోడీకి శశికళ లేఖ


రెండు రోజుల క్రితమే తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కూడా ప్రధాని మంత్రికి జల్లికట్టుకు అనుమతివ్వాలని కోరుతూ లేఖ రాశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.