యాప్నగరం

శశికళకు షాక్.. ప్రమాణస్వీకారం రద్దు!

చిన్నమ్మకు షాక్ తగిలింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా చక్రం తిప్పుదామనుకున్న శశికళకు ఆదిలోనే బ్రేక్ పడింది.

TNN 6 Feb 2017, 10:41 pm
చిన్నమ్మకు షాక్ తగిలింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా చక్రం తిప్పుదామనుకున్న ఆమెకు ఆదిలోనే బ్రేక్ పడింది. సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు మంగళవారం జరగనున్న వీకే శశికళ ప్రమాణస్వీకార కార్యక్రమం తాత్కాలికంగా రద్దయ్యింది. శశికళతో ప్రమాణం చేయించడానికి రేపు తమిళనాడు రావాల్సిన గవర్నర్ విద్యాసాగర్ రావు తన పర్యటనను రద్దు చేసుకున్నారు. దీంతో చిన్నమ్మ ప్రమాణం కూడా రద్దయ్యింది. మరోవైపు గవర్నర్‌ను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు రాజ్‌భవన్ అధికారులు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదు.
Samayam Telugu sasikalas swearing cancelled
శశికళకు షాక్.. ప్రమాణస్వీకారం రద్దు!


శశికళను ముఖ్యమంత్రి పీఠం ఎక్కనివ్వకుండా బీజేపీ కుట్రలు పన్నుతోందని అన్నాడీఎంకే నేతలు ఆరోపిస్తున్నారు. సుప్రీంకోర్టులో శశికళ అక్రమాస్తుల కేసుపై మరో వారం రోజుల్లో తీర్పు వెలువడనుండటంతో ఎలాగైనా ఆమెను సీఎంగా ప్రమాణస్వీకారం చేయకుండా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. కావాలనే బీజేపీ శశికళను అడ్డుకుంటే తమిళనాడులో మరోసారి నిరసనలు వెల్లువెత్తుతాయని హెచ్చిరస్తున్నారు.

కాగా, అక్రమాస్తుల కేసులో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో శశికళ ప్రమాణస్వీకారాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని సుప్రీంకోర్టులో ప్రజావాజ్యం దాఖలైంది. చెన్నైలోని సట్ట పంచాయత్ ల్యాక్కమ్ అనే స్వచ్ఛంద సంస్థ జనరల్ సెక్రటరీ సెంథిల్ కుమార్ ఈ మేరకు సుప్రీంకోర్టులో ప్రజావాజ్యం దాఖలు చేసారు. జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ మరో నిందితురాలు. అయితే ప్రథమ నిందితురాలు జయలలిత మరణించడంతో రెండో నిందితురాలు అయిన శశికళ విచారణను ఎదుర్కొంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.