యాప్నగరం

‘జనగణమన’పై మరోసారి ‘సుప్రీం’ కామెంట్

జాతీయ గీతం ‘జనగణమన’పై సుప్రీంకోర్టు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది.

Samayam Telugu 2 Dec 2016, 1:23 pm
జాతీయ గీతం ‘జనగణమన’పై సుప్రీంకోర్టు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. అన్నిరకాల న్యాయస్థానాల్లో జాతీయగీతాన్ని ఆలపించడం తప్పనిసరి చేయలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
Samayam Telugu sc declined to take up plea to make national anthem in courts
‘జనగణమన’పై మరోసారి ‘సుప్రీం’ కామెంట్

దేశవ్యాప్తంగా ఉన్న న్యాయస్థానాల్లో జాతీయ గీతాలాపన తప్పనిసరి చేసేలా ఆదేశించాలంటూ అశ్వినీ ఉపాధ్యాయ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. పిటిషన్ సమగ్రంగా లేనందున దీనిపై ఏలాంటి ఆదేశాలు జారీచేయలేమని పేర్కొంటూ...దీనిపై అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని కోరింది. పిటిషన్ సమగ్రంగా లేనందున అభిప్రాయం చెప్పలేమని అటార్నీ జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు.

సినిమా థియేటర్లలో సినిమా ప్రారంభానికి ముందు జాతీయగీతం తప్పనిసరిగా ప్రదర్శించడంతోపాటు ఆ సమయంలో ప్రేక్షకులంతా లేచి నిలబడాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.