యాప్నగరం

ఆధార్‌పై తీర్పును రిజర్వ్‌‌లో ఉంచిన సుప్రీం!

ఆధార్ చ‌ట్ట‌బ‌ద్ద‌తకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై గురువారం (మే 10) విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఈ విషయమై తమ వాదనను వినిపిస్తూ.. రాతపూర్వక ప్రతులను సమర్పించాల్సిందిగా సంబంధిత వర్గాలను కోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీచేసింది.

TNN 10 May 2018, 8:42 pm
ఆధార్ చ‌ట్ట‌బ‌ద్ద‌తకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై గురువారం (మే 10) విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఈ విషయమై తమ వాదనను వినిపిస్తూ.. రాతపూర్వక ప్రతులను సమర్పించాల్సిందిగా సంబంధిత వర్గాలను కోర్టు ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీచేసింది. నాలుగు నెలల నుంచి విచారణ జరుపుతున్న ధర్మాసనం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
Samayam Telugu SUPREME COURT1


ఈ విచారణలో కేంద్రం తరపున అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ వాదనలు వినిపించగా.. వివిధ వర్గాల తరుఫున సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, పి.చిదంబరం, రాకేష్‌ ద్వివేది, శ్యామ్‌ దివాన్‌, అరవింద్‌ దతార్‌ తమ వాదనలు వినిపించారు. మొబైల్ నెంబర్లను ఆధార్‌కు అనుసంధానం చేయాలన్న తన నిర్ణయాన్ని కేంద్రం మరోసారి సమర్దించుకుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.