యాప్నగరం

ఆధార్ కేసు.. సుప్రీంలో మమతకు ఎదురుదెబ్బ

​ ఆధార్ విషయంలో బెంగాల్ ముఖ్యమంత్రికి సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బతగిలింది. పార్లమెంట్ చేసిన చట్టాలకు వ్యతిరేకంగా ..

TNN 30 Oct 2017, 2:16 pm
ఆధార్ విషయంలో బెంగాల్ ముఖ్యమంత్రికి సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బతగిలింది. పార్లమెంట్ చేసిన చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలా పిటీషన్ వేస్తుందంటూ.. మమతా బెనర్జీని అత్యున్నత ధర్మాసనం ప్రశ్నించింది. సంక్షేమ పథకాలకు ఆధార్‌ను తప్పనిసరి చేయడాన్ని వ్యతిరేకిస్తూ.. మమత సర్కారు అత్యున్నత ధర్మాసనాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఆధార్‌కు వ్యతిరేకంగా పోరాడాలంటే.. ప్రభుత్వం తరఫున కాకుండా వ్యక్తిగతంగా కోర్టును సంప్రదించాలని సూచించింది. పార్లమెంట్ చేసిన చట్టానికి వ్యతిరేకంగా వ్యక్తిగతంగా పిటీషన్ వేయండి, కానీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాదంటూ సుతిమెత్తగా హెచ్చరించింది.
Samayam Telugu sc slams mamata government on aadhaar plea says state cant challenge law passed by centre
ఆధార్ కేసు.. సుప్రీంలో మమతకు ఎదురుదెబ్బ


మొబైల్ కనెక్షన్లకు ఆధార్ తప్పనిసరి చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన మరో పిటీషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు.. కేంద్రానికి నోటీసులు పంపింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. అత్యున్నత ధర్మాసనం సూచనలతో పశ్చిమ బెంగాల్ సర్కారు పిటీషన్‌ విషయంలో వెనక్కి తగ్గింది.

అక్టోబర్ 25న మమతా బెనర్జీ పార్టీ సమావేశంలో మట్లాడుతూ.. ఆధార్‌తో మొబైల్ అనుసంధానాన్ని వ్యతిరేకించారు. నా ఫోన్‌కు నేను ఆధార్‌తో లింక్ చేసుకోను. నా మొబైల్ కనెక్షన్ రద్దయినా నేను ఆ పని చేయనని తెలిపారు. సంక్షేమ పథాకాల కోసం ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడానికి తుది గడువును మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం అదే రోజు సుప్రీం కోర్టుకు తెలిపింది. ఆధార్ లింకింగ్ విషయమై సుప్రీంలో చాలా పిటీషన్లు పెండింగ్‌లో ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.