యాప్నగరం

జల్లికట్టు బిల్లుపై సుప్రీంలో విచారణ

జల్లికట్టు బిల్లు చట్టబద్ధతపై సుప్రీం కోర్టు జనవరి 30న విచారణ చేయనుంది.

TNN 25 Jan 2017, 12:54 pm
జల్లికట్టు పై చెన్నైలోని యువత చేసిన ఆందోళనకు దిగొచ్చిన తమిళనాడు ప్రభుత్వం ఆఘమేఘాల మీద అసెంబ్లీని ఏర్పాటు చేసింది. జల్లికట్టు బిల్లును ప్రవేశపెట్టి... సభ ఆమోదం పొందేలా చేసింది. దానిని చట్టంగా మార్చేందుకు రాష్ట్రపతి సంతకం కోసం పంపింది. ఈ పరిణామాలపై ది యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన జల్లికట్టు చట్టబద్దతను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్ పై విచారణ చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. జనవరి 30న ఈ పిటిషన్ విచారణ చేపడతామని అత్యున్నత ధర్మాసనం ప్రకటించింది.
Samayam Telugu sc to hear plea against jallikattu on monday
జల్లికట్టు బిల్లుపై సుప్రీంలో విచారణ


జల్లికట్టులో ఎద్దులను తీవ్రంగా హింసిస్తున్నారని పెటా సంస్త గతంలో కోర్టుకెక్కింది. దీంతో జల్లికట్టుపై 2014లోనే నిషేధం పడింది. కాగా సంక్రాంతి సందర్భంగా మళ్లీ జల్లికట్టు అంశం తెరమీదకు వచ్చింది. పొంగల్ సమయంలో ఆడే ఆటను అడ్డుకోవద్దంటూ పలువురు నిరసన తెలిపారు. చెన్నైలోని మెరీనా బీచ్ లో యువత పెద్ద ఉద్యమమే చేసింది. ఆ ఉద్యమం హింసాత్మకంగానూ మారింది. దీంతో తమిళనాడు ప్రభుత్వం హుటాహుటిన అసెంబ్లీని ఏర్పాటు చేసి జల్లికట్టును చట్టబద్ధం చేసేందుకు బిల్లు పాస్ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.