యాప్నగరం

కరోనాతో తల్లి మృతి ... మృతదేహాన్ని ఆస్పత్రిలోనే వదిలేసిన కొడుకు

మార్చి 31న కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన తల్లి. కరోనాతో ప్రాణాలు వదిలిన తల్లి. మృతదేహాన్ని ఆస్పత్రిలోనే వదిలేసిన బంధవులు. డెడ్ బాడీని తీసుకెళ్లనని చెప్పేసిన కొడుకు.

Samayam Telugu 7 Apr 2020, 10:01 am
కరోనా వైరస్ ప్రాణాల్నే కాదు.. మానవ సంబంధాల్ని, అనుబంధాల్ని సైతం దెబ్బతిస్తోంది. అందుకే పంజాబ్‌ల చోటు చేసుకున్న ఈ ఘటనే నిదర్శనం. నవమాసాలు కనిపెంచిన ఓ తల్లి దురదృష్ట వశాత్తు కరోనాతో మరణించింది. అయితే ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు బంధువులు ఎవరూ ముందుకు రాలేదు. ఆఖరికి కన్న కొడుకు కూడా తల్లి డెడ్ బాడీనికి తీసుకెళ్లడానికి నిరాకరించాడు. ఈ దారుణ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని లుధియానాలో చోటు చేసుకుంది.
Samayam Telugu 02virus-pandemic-sub-articleLarge


షిమ్లాపురి గ్రామానికి చెందిన 69 ఏళ్ల వృద్ధురాలిని కరోనా లక్షణాలతో మార్చి 31న ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించారు. గత ఆదివారం ఆమె కరోనా రక్కసి కారణంగా ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లాలని జిల్లా అధికారులు ఆమె కుమారుడిని కోరారు. అయితే ఆమె శవాన్ని తీసుకెళ్లేందుకు కుమారుడు కానీ, బంధువులు కానీ ఎవరూ రాలేదు. దీంతో అధికారులు షాక్ కు గురయ్యారు.

ఈ ఘటనపై అక్కడి అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ స్పందించారు. డెడ్ బాడీ నుంచి ఇన్ఫెక్షన్ సోకకుండా అవసరమైన ప్రొటెక్టివ్ గేర్స్ కూడా ఇస్తామని చెప్పిన డెడ్ బాడీని ఎవరు తీసుకువెళ్లలేదన్నారు. ఆమె కుమారుడు కానీ, బంధువులు కానీ రాలేదని చెప్పారు. ఆమె కుటుంబ సభ్యులను అధికారులు రెండు సార్లు సంప్రదించారని... ఎవరూ కూడా ముందుకు రాలేదని తెలిపారు. ఈ ఘటన తమను షాక్ కు గురి చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు చేసేదేమీ లేక... సోమవారం అర్ధరాత్రి జిల్లా అధికారులే అంత్యక్రియలను నిర్వహించారని చెప్పారు. మృతురాలి కుమారుడు, బంధువులు అంత్యక్రియలను 100 మీటర్ల దూరం నుంచి వీక్షించారని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.