యాప్నగరం

ఆ కెమేరాలు.. అతడిని బతికించాయి!

నిఘా నేత్రాలు దోషులను పట్టివ్వడంలోనే కాదు.. ప్రాణాలు నిలిపేందుకు కూడా ఉపయోగపడుతున్నాయనడానికి ఈ సంఘటనే నిదర్శనం.

TNN 13 Oct 2016, 4:41 pm
ముంబయి: వేకువజాము 3.10 గంటలు. ముంబయి నగరమంతా గాఢ నిద్రలో ఉంది. నిత్యం రద్దీగా ఉండే బంద్రావర్లీ సీలింక్ వంతెనపై కూడా వాహనాల రాకపోకలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇదే అదనుగా భావించిన ఓ వ్యక్తి.. ఆత్మహత్యకు యత్నించాడు. వంతెనపై నుంచి సముద్రంలోకి దూకేందుకు సిద్ధమవుతుండగా.. అక్కడి సిబ్బంది వచ్చి రక్షించారు. అయితే, అతడి ప్రాణాలను నిలిపిన క్రెడిట్ మాత్రం.. నిఘా కెమేరాలకే దక్కుతుంది. వంతెనపై అనుమానస్పదంగా తిరుగుతూ.. నీళ్లలోకి దూకేందుకు చేస్తున్న ప్రయత్నాలు అక్కడ ఉన్న సీసీటీవీ కెమేరాలకు చిక్కాయి. కంట్రోల్ రూమ్‌‌‌‌ ‌సూపర్‌వైజర్ చేతన్ కదం ఆ దృశ్యాలు గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. హుటాహుటిన అక్కడికి చేరుకుని.. అతడికి నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. సుమారు 25 నిమిషాల నాటకీయ పరిణామాల తర్వాత వంతెన రైలింగ్‌ వదిలి బయటకు వచ్చాడు. వంతెన సిబ్బందికి, పోలీసులకు ముచ్చెమటలు పట్టించిన ఆ వ్యక్తిని భయందర్‌‌‌‌కు చెందిన ప్రదీప్ యాదవ్‌‌‌‌‌‌‌‌గా గుర్తించారు. కుటుంబ సమస్యల మూలంగా యాదవ్ ఆత్యహత్యకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. సీలింక్ వంతెనపై పదుల సంఖ్యలో ఆత్యహత్యలు చోటు చేసుకున్నాయి. దీంతో, వంతెన నిర్వాహకులు 80 అత్యాధునిక నిఘా కెమేరాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు.
Samayam Telugu sea link cameras help foil mans suicide bid
ఆ కెమేరాలు.. అతడిని బతికించాయి!

సంఘటన ​ దృశ్యాలివీ:


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.