యాప్నగరం

ఢిల్లీ ఆరోగ్య మంత్రికి కరోనా పాజిటివ్.. రెండోసారి పరీక్షలో షాక్

Delhi: ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలింది. మొదటిసారి చేసిన పరీక్షలో నెగటివ్‌గా నిర్ధారణ కాగా.. రెండోసారి చేసిన టెస్టులో వైరస్ సోకినట్లు తేలింది.

Samayam Telugu 17 Jun 2020, 8:36 pm
ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తీవ్ర జ్వరంతో బాధ పడుతున్న ఆయనకు వైద్యులు బుధవారం (జూన్ 17) ఉదయం రెండోసారి వైద్య పరీక్షలు నిర్వహించారు. సాయంత్రం వచ్చిన ఫలితాల్లో ఆయనకు కరోనా సోకినట్లుగా తేలింది. మొదటిసారి చేసిన పరీక్షలో ఆయనకు కరోనా నెగటివ్‌గా వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా పాజిటివ్ రావడంతో ఆమ్ ఆద్మీ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. వైద్యులు ఆయనకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.
Samayam Telugu సత్యేంద్ర జైన్
Delhi Health Minister


ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిషి బుధవారం ఉదయం తనకు కూడా కరోనా సోకిందని ప్రకటించారు. కొద్ది రోజులుగా జ్వరంతో బాధ పడుతున్న సత్యేంద్ర జైన్‌ చికిత్స కోసం సోమవారం ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు. నాటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు.

జ్వరంతో పాటు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న మంత్రి సత్యేంద్ర జైన్‌కు వైద్యులు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

ఢిల్లీలో కరోనా వైరస్ విజృంభణ, పరిస్థితులపై చర్చించేందుకు సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశానికి మంత్రి సత్యేంద్ర జైన్ హాజరయ్యారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆందోళన నెలకొంది.

ఢిల్లీలో ప్రతి పది లక్షల మందికి 70.92 మంది చనిపోతుండటం ఆందోళన కలిగించే అంశం. ఇది జాతీయ సగటు కంటే 10 రెట్లు ఎక్కువగా ఉంది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో 65 శాతానికి పైగా కేవలం ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల నుంచే వస్తుండటం గమనార్హం.

Also Read: వెంటిలేటర్‌పై గవర్నర్ లాల్జీ టాండన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.