యాప్నగరం

ఆ నేతపై దేశద్రోహం కేసు ఎందుకు?

తనపై దాఖలైన దేశద్రోహం కేసును త్వరితగతిన విచారణ చేపట్టాలని తమిళనాడు ఎండీఎంకే నేత వైగో సోమవారం

Samayam Telugu 3 Apr 2017, 5:22 pm
తనపై దాఖలైన దేశద్రోహం కేసును త్వరితగతిన విచారణ చేపట్టాలని తమిళనాడు ఎండీఎంకే నేత వైగో సోమవారం కోర్టులో లొంగిపోయారు. ఆయన బెయిల్ పొందడానికి నిరాకరించారు. దీంతో న్యాయమూర్తి వైగోకు 14రోజుల రిమాండ్ విధించారు.
Samayam Telugu sedition case vaiko surrenders refuses appeal for bail
ఆ నేతపై దేశద్రోహం కేసు ఎందుకు?


అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు పలు ప్రజాసమస్యలపై తాను రాసిన బహిరంగ లేఖలను వైగో ‘నాన్ కుట్రమ్ సత్తుగిరేన్’ (నేను నిన్ను నిందిస్తున్నా) అనే పేరుతో 2009లో సంకలన పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకం విడుదల సందర్భంగా మాట్లాడిన వైగో ప్రసంగం దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉందని, చెన్నై పోలీసులు దేశద్రోహం కేసు పెట్టారు. 2010లో చార్జీషీట్ దాఖలు చేసినా ఇప్పటి వరకు విచారణ జరపలేదు.

దీంతో వైగో సోమవారం చెన్నైలోని ఎనిమిదో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ గోపినాథ్ ఎదుట లొంగిపోయారు. అయితే మెజిస్ట్రేట్ వైగోకు బెయిల్ కు దరఖాస్తుకు అవకాశం కల్పించినా ఆయన తిరస్కరించారు. దీంతో ఆయన వైగోకు 14రోజుల రిమాండ్ విధించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.