యాప్నగరం

‘సెల్ఫీ విత్ డాటర్’ యాప్‌ ప్రారంభం

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ‘సెల్ఫీ విత్ డాటర్’ యాప్ ప్రారంభమైంది. భ్రూణహత్యలు,

Samayam Telugu 10 Jun 2017, 10:21 am
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ‘సెల్ఫీ విత్ డాటర్’ యాప్ ప్రారంభమైంది. భ్రూణహత్యలు, మహిళలపై హింసను వ్యతిరేకిస్తూ రూపొందించిన ఈ యాప్ ను విజయవంతం చేయాలని ప్రణబ్ పిలుపునిచ్చారు. తల్లిదండ్రులు కూతుళ్లతో ఫొటో (సెల్ఫీ) దిగి www.selfiewithdaughter.world అనే వెబ్ సైట్లో అప్ లోడ్ చేయాలని.. తద్వారా..బాలికలు, మహిళల్లో ఆత్మస్థైర్యం పెరుగుతుందని ఆయన అన్నారు.
Samayam Telugu selfie with daughter app launched by president pranab
‘సెల్ఫీ విత్ డాటర్’ యాప్‌ ప్రారంభం


‘భ్రూణహత్యలు, మహిళలపై హింసను వ్యతిరేకిస్తూ ‘సెల్ఫీ విత్ డాటర్’ ప్రపంచ వ్యాప్త ఉద్యమంగా మారిందని’ ప్రణబ్ పేర్కొన్నారు.
హర్యానాలోని జింద్ జిల్లాలోని బిబీపూర్ కు చెందిన మాజీ సర్పంచ్ సునీల్ జగ్లాన్ 2015 జూన్ లో ‘సెల్ఫీ విత్ డాటర్’ వినూత్నమైన ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. మహిళా సాధికారత కోసం, ఆడపిల్లలు పుడితే గర్వంగా ఫీలవ్వాలనేది ఈ యాప్ కాన్సెప్ట్. భ్రూణహత్యలు ఆగిపోవాలని జగ్లాన్ ఉద్యమిస్తున్నారు. జగ్లాన్ ను ప్రణబ్ అభినందించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.