యాప్నగరం

Nivar: చెన్నై వరదలు.. హైదరాబాద్ కంటే విషాదం!

Chennai: నివర్ తుఫాన్ కారణంగా కురుస్తున్న భారీ వర్షాలతో చెన్నై నగరం అతలాకుతలం అవుతోంది. పలు కాలనీల్లో ఇళ్లు నీటమునిగి, జనం తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. సాయం కోసం అర్థిస్తున్నారు.

Samayam Telugu 27 Nov 2020, 12:02 am
Samayam Telugu నివర్ తుఫాన్ ప్రభావం
Cyclone Nivar effect in Chennai
నివర్ తుఫాన్ తమిళనాడు, పుదుచ్చేరిని అతలాకుతలం చేసింది. చెన్నై నగరంలో కుండపోత వానలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల మొదటి అంతస్తు వరకు నీటిలో మునిగిపోయాయి. వరద నీటిలో చిక్కుకున్న వారిని NDRF బృందాలు బోట్ల సాయంతో బయటకు తీసుకొచ్చి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పలువురు బాధితులు ఇళ్ల పైకి, డాబాల పైకి చేరుకొని సాయం కోసం అర్థిస్తున్నారు.

మరోవైపు.. చెన్నై తాగునీటి అవసరాలను తీర్చే చెంబరాంబక్కమ్ (Chembarambakkam) జలాశయానికి వరద నీరు పోటెత్తింది. దీంతో అధికారులు గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఫలితంగా లోతట్టు ప్రాంతాల్లో జనావాసాలన్నీ నీట మునిగాయి. ముఖ్యంగా వరధరాజపురం ప్రాంతం జలదిగ్బంధమైంది. ఆ దృశ్యాలను వీడియోలో చూడవచ్చు.

Video: చెన్నై వరదలు.. విషాద దృశ్యాలు


ఇటీవల హైదరాబాద్ నగరంలో కురిసిన కుండపోత వానలతోనూ ఇలాంటి బీభత్సమే జరిగింది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లన్నీ నీట మునిగాయి. సుమారు 140 కాలనీలు వారం రోజుల వరకు నీటిలోనే మునిగిపోయాయి. వరద నీటిలో తడిచి వస్తువులన్నీ పాడయ్యాయి. ఇప్పుడు చెన్నైలోనూ ఇలాంటి విషాదమే నెలకొంది.

నివర్ తుఫాన్‌తో కురిసిన భారీ వర్షాల కారణంగా తమిళనాడులో ఇప్పటివరకు ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలిపారు. వీరిలో ఇళ్లు కూలిపోయిన ఘటనలో ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. 1000కి పైగా వృక్షాలు నేలకొరిగాయి. విద్యుత్, కరెంట్ స్తంభాలు కూలిపోయాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో అంధకారం నెలకొంది.

మరోవైపు.. తీరం దాటిన తర్వాత బలహీనపడిన నివర్ తుఫాన్ ప్రస్తుతం బాగా బలహీనపడి కర్ణాటక రాష్ట్రం వైపు తరలిపోయినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Also Read: కార్లు వరదలో కొట్టుకుపోకుండా ఇలా పార్క్ చేశారు.. సేఫ్ ప్లేస్!
Must Read: ఆ గాయాలను భారత్ ఎన్నటికీ మరవదు.. వారికి వందనం చేస్తున్నా: మోదీ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.