యాప్నగరం

మహిళా ఐఏఎస్‌కు వేధింపులు.. ఫేస్‌బుక్ పోస్ట్ వైరల్

ప్రభుత్వ ఆఫీసుల్లో మహిళా ఉద్యోగులకే కాదు.. ఐఏఎస్‌లకు వేధింపులు తప్పడం లేదు. హర్యానాలో ఓ మహిళా అధికారి తాను ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టడం సంచలనంగా మారింది.

Samayam Telugu 10 Jun 2018, 9:05 pm
ప్రభుత్వ ఆఫీసుల్లో మహిళా ఉద్యోగులకే కాదు.. ఐఏఎస్‌లకు వేధింపులు తప్పడం లేదు. హర్యానాలో ఓ మహిళా అధికారి తాను ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టడం సంచలనంగా మారింది. ఓ సీనియర్ అధికారి తనను వేధిస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 'మే 22న నన్ను బెదిరించారు. నీపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తా.. నీ ఏసీఆర్ రిపోర్ట్‌‌ నాశనం అవుతుందన్నారు. మే 31న నన్ను తన క్యాబిన్‌లోకి పిలిచి.. మిగిలిన ఉద్యోగుల్ని బయటకు పంపారు. ప్రభుత్వ ఫైల్స్‌లో వ్యతిరేకంగా ఎందుకు రాస్తున్నావ్. నేను ఏం చెప్పానో అది మాత్రమే చెయ్ అన్నారు. చూడ్డానికి కొత్త పెళ్లి కూతురిలా ఉన్నావని కామెంట్ చేశారు' అని చెప్పింది.
Samayam Telugu IAS


'జూన్ 6 సాయంత్రం మళ్లీ నన్ను తన ఆఫీస్‌లో కలవమన్నారు. అక్కడికి వెళ్లాను.. 7.39 వరకు అక్కడే వెయిట్ చేయించారు. తర్వాత వెళ్లి కలవగా.. అతడి ఎదురుగా ఉన్న కూర్చీలో వెళ్లి కూర్చున్నా. అతడు నన్ను పైకి లెమ్మని.. దగ్గరికి రమ్మని పిలవడంతో వెళ్లాను. కంప్యూటర్‌ను ఎలా ఉపయోగించాలో నాకు చెప్పారు. భయంతో అతడి నుంచి దూరంగా జరిగిన మళ్లీ నేను కూర్చున్న కుర్చీ దగ్గరకు వచ్చాను. తర్వాత ఆ అధికారి వచ్చి నా కుర్చీని బలవంతంగా తోసేశాడు. తర్వాత కూడా నాకు వేధింపులు ఆగలేదు. కొంతమంది అధికారులతో.. ముఖ్యంగాఓ సీనియర్ మహిళా ఐఏఎస్ అధికారి కూడా నన్ను బెదిరించేందుకు ఆయన ప్రయత్నించారు' అని ఆరోపించారు.

ఈ ఆరోపణలపై ఆ సీనియర్ అధికారి స్పందించారు. ఆమె చెప్పేవన్నీ అబద్ధాలు, నిరాధారమైన ఆరోపణలన్నారు. ఆమెపై ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదన్నారు. తన పని చేస్తున్న శాఖకు ఆమె కొత్తగా వచ్చారని.. పని విషయంలో ఆమెకు సాయం చేసే ప్రయత్నం చేశానన్నారు. ఇటు ఆ అధికారి వ్యాఖ్యలపై మళ్లీ మహిళా ఐఏఎస్ స్పందించారు. తాను చెప్పిన ప్రతి మాటా నిజం.. కొద్ది రోజుల్లో సీసీటీవీ ఫుటేజీ నిజాలు బయటపడతాయంటోంది. వేధింపులపై ఆమె ఇప్పటికే ఈ-మెయిల్ ద్వారా రాష్ట్రపతి కార్యాలయానికి ఫిర్యాదు చేసిందట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.