యాప్నగరం

షాకింగ్: షారుక్ ఖాన్‌ ఎదురుగా కొమొడో డ్రాగన్

అది ఓ ఎడారి.. అందులో ఓ చోట బురదగుంట లాంటి ఊబి.. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఆయనతోపాటున్న ఓ అమ్మాయి..

Samayam Telugu 5 Jun 2017, 5:17 pm
అది ఓ ఎడారి.. అందులో ఓ చోట బురదగుంట లాంటి ఊబి.. బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఆయనతోపాటున్న ఓ అమ్మాయి.. ఇద్దరూ అందులో చిక్కుకున్నారు. అక్కడి నుంచి ఎలా బయటపడాలని ఆలోచిస్తున్న వీరికి.. ఇంతలో ఊహించని విపత్తు.. ఎదురుగా కొమొడో డ్రాగన్ (భారీ ఉడుముం) మీదకు వచ్చేస్తోంది. అది చూసి అమ్మాయి షారుక్ ను గట్టిగా పట్టుకొని..రక్షించమని అరుస్తోంది. ఊహించని ఈ పరిణామానికి షారుక్ కు కూడా ఏం చేయాలో తోచడం లేదు. అయినా ధైర్యంగా ముందు అమ్మాయికి ధైర్యం చెప్పాడు.. చేతిలో కర్ర లాంటిది ఏమీ లేకపోయినా.. బురదతో కొమొడోను భయపెట్టించడానికి ప్రయత్నాంచాడు. ఈలోపు కొమొడో ఇంకాస్తా దగ్గరికొస్తోంది..ఒకటే ఉత్కంఠ..
Samayam Telugu shahrukh khan faces prank call in dubai yells at anchor
షాకింగ్: షారుక్ ఖాన్‌ ఎదురుగా కొమొడో డ్రాగన్


అచ్చం నిజ జీవితంలో జరిగినట్లే ఉన్న ఈ సీన్ దుబాయ్ లో జరిగింది. షారూక్ ఆయనతో పాటున్న అమ్మాయి తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఊబిలో చిక్కుకుంటారు. కానీ వారికి కొమొడో వస్తుందని (నిజం కొమొడో కాదు) వస్తుందని నిర్వహకులు చెప్పలేదు. దీంతో షారూక్ సీరియస్ అయ్యాడు. మరి దగ్గరికొచ్చే సరికి.. కొమొడో నుంచి యాంకర్ బయటకు వచ్చి పెద్దపెద్దగా నవ్వడంతో షారూక్ కు ఎక్కడో కాలింది.

దీంతో ఆ యాంకర్ సీరియస్ అయ్యాడు. తనతో మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చాడు. ఆ యాంకర్ కల్పించుకొని.. మీరు మా హీరో.. దుబాయ్ లో కూడా అభిమానులున్నారని.. చెప్పాడు. అయినా అదే కోపంతో ఉన్న షారూక్.. ఆ యాంకర్ ను కిందపడేసి...కొట్టబోయాడు.. ‘ప్రాంక్ సెటప్ అంటే ఇలా ఉంటుందా?’ అంటూ సీరియస్ అయ్యాడు. ఇలాంటి పిచ్చి పనులు మానుకోవాలని వార్నింగ్ కూడా ఇవ్వడం వీడియోలో చూడొచ్చు.. ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది.



తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.